ఏఐతో తయారైన వీడియోలను సులభంగా గుర్తించేలా గూగుల్(Google Gemini AI) తన జెమినీ ప్లాట్‌ఫామ్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు గరిష్టంగా 100MB లేదా 90 సెకన్ల నిడివి ఉన్న వీడియోను జెమినీ యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. అనంతరం “ఈ వీడియో గూగుల్ ఏఐతో రూపొందించబడిందా?”(‘Was this generated using Google AI?’) అనే ప్రశ్న అడిగితే, సిస్టమ్ స్పష్టమైన సమాధానాన్ని ఇస్తుంది. వీడియోలో దాగి ఉన్న SynthID అనే అదృశ్య వాటర్‌మార్క్‌ను స్కాన్ చేసి, ఏఐ టెక్నాలజీ ఉపయోగించబడిందా లేదా అన్న విషయాన్ని గుర్తిస్తుంది.
Read also: Truecaller: కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే, వీడియో మొత్తం ఏఐతో తయారైందా లేదా కేవలం కొన్ని భాగాల్లో మాత్రమే ఏఐ వినియోగించారా అన్న వివరాలను కూడా తెలియజేయడం. వీడియో తయారీ, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ లేదా వాయిస్ జనరేషన్ వంటి ఏ దశలో ఏఐని ఉపయోగించారో కూడా స్పష్టంగా చూపిస్తుంది. దీని ద్వారా డీప్‌ఫేక్ వీడియోలు(Deepfake videos), తప్పుడు ప్రచార కంటెంట్‌ను గుర్తించడం మరింత సులభమవుతుందని గూగుల్ చెబుతోంది.
ఇటీవల సోషల్ మీడియాలో ఏఐతో రూపొందించిన వీడియోలు విస్తృతంగా వైరల్ అవుతుండటంతో, వాస్తవం నకిలీ మధ్య తేడాను గుర్తించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో గూగుల్(Google Gemini AI) తీసుకొచ్చిన ఈ ఫీచర్ జర్నలిస్టులు, కంటెంట్ క్రియేటర్లు, సాధారణ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. డిజిటల్ ప్రపంచంలో నమ్మకాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు గూగుల్ స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :