టాప్ సెర్చింజిన్ గూగుల్(Google). విశాఖపట్నంలో భారీ పెట్టుబడి పెట్టింది. 15 బిలియన్ డాలర్లతో డేటా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ను నెలకొల్పనుంది. గిగావాట్ ప్లస్ డేటా సెంటర్ ఇది. అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తోన్ మొట్టమొదటి AI కేంద్రం ఇదే. దీనికి సంబంధించి ఒప్పందాలు సైతం కుదిరాయి. ఈ డేటా సెంటర్ వల్ల వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. మరిన్ని పెట్టుబడులు ఏపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది.
Read Also: Gautam Singhania : ఎలక్ట్రానిక్ వాహనాలను రాజకీయంగా ప్రమోట్ చేస్తున్నారు..! గౌతమ్
భారత్ లో గూగుల్ అతిపెద్ద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
ఈ భారీ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి విశాఖపట్నాన్ని ఎంచుకోవడానికి గల కారణాలను గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్(Sundrai Pichai) వెల్లడించారు. డ్రీమ్‌ఫోర్స్ అనుబంధ సంస్థ సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాఫ్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. భారత్ లో గూగుల్ పెడుతున్న అతిపెద్ద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్ మెంట్ గా ఈ ప్రాజెక్ట్ ను అభివర్ణించారు.

2026 నుండి 2030 మధ్యకాలంలో దీన్ని పూర్తి చేస్తామని సుందర్ పిచాయ్ వివరించారు. ఈ ప్రాజెక్ట్ లో గిగావాట్ స్థాయి డేటా సెంటర్ కార్యకలాపాలు, కొత్త ఇంధన వనరుల అభివృద్ధి, ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్క్ వంటివి ఉంటాయని తెలిపారు.
ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతంతో అనుకూలం
దీనికి 80 శాతం విద్యుత్ ను క్లీన్ ఎనర్జీ నుంచి తీసుకుంటామని, సబ్- సీ కేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తామని అని పిచాయ్ చెప్పారు. ఇంత భారీ పెట్టుబడి విశాఖపట్నంలో పెట్టడానికి గల కారణాలను ఆయన వివరించారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం, ప్రత్యేకించి భౌగోళిక, వాతావరణపరంగా అనుకూలంగా ఉంటోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన చిన్నప్పటి రైలు ప్రయాణాలను గుర్తు చేసుకున్నారు. విశాఖపట్నం లాంటి అందమైన తీర ప్రాంత నగరాన్ని చిన్నప్పుడే చూశానని, ఆ నగరంతో ఓ ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, తాను సీఈఓగా ఉంటోన్న గూగుల్ ఇప్పుడక్కడ భారీ పెట్టుబడులు పెడుతోండటం సంతోషంగా ఉందని అన్నారు.
గూగుల్ సీఈఓ జీతం రూపాయల్లో ఎంత?
గూగుల్ (ఆల్ఫాబెట్) సీఈఓ సుందర్ పిచాయ్ 2024లో సుమారు రూ. 900 కోట్ల (సుమారు $100 మిలియన్లు) వార్షిక పరిహార ప్యాకేజీని అందుకున్నారు, ఇది ఆయన చెల్లించిన రూ. 1,900 కోట్ల ($226 మిలియన్లు) పరిహారం కంటే చాలా తక్కువ.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: