Gold price today : బంగారం, వెండి ధరలు ఇక తగ్గుతాయేమో అనుకున్న పెట్టుబడిదారులకు మరోసారి షాక్ తగిలింది. అంతర్జాతీయంగా నెలకొన్న కొత్త ఉద్రిక్తతలు పసిడి, వెండి ధరలను ఒక్కసారిగా పైకి నెట్టేశాయి. ఒకవైపు వెనెజువెలాపై అమెరికా ఆకస్మిక దాడులు చేయడం, మరోవైపు భారత్‌పై టారిఫ్‌లు పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం వల్ల గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది.
ఈ పరిణామాల ప్రభావంతో ఇన్వెస్టర్లు మళ్లీ సురక్షిత (Gold price today) పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గోల్డ్, సిల్వర్ రేట్లు దేశీయంగా, అంతర్జాతీయంగా భారీగా పెరిగాయి. గత వారం గరిష్ఠ స్థాయిల నుంచి తగ్గిన ధరలు, ఇప్పుడు తిరిగి పుంజుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,450 డాలర్ల మార్కును దాటింది. ట్రంప్ టారిఫ్ హెచ్చరికలకు ముందు ఇది 4,320 డాలర్ల స్థాయిలో ఉండగా, ఒక్క రోజులోనే దాదాపు 120 డాలర్ల పెరుగుదల నమోదైంది. అలాగే స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 72 డాలర్ల నుంచి 77 డాలర్ల స్థాయికి చేరింది.
Read also: Mohammed Shami: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన షమీ..
ఇదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ (Gold price today) మరింత బలహీనపడింది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ 90.28 వద్ద ట్రేడవుతోంది. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమైంది.
దేశీయ మార్కెట్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులోనే రూ. 2,200 పెరిగి తులం రూ. 1,26,700కు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ. 2,400 పెరిగి 10 గ్రాములకు రూ. 1,38,220గా ఉంది.
వెండి ధరలు మరింత వేగంగా పెరిగాయి. (Gold price today) ఒక్క రోజులోనే రూ. 8,000 పెరగడంతో హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 2.65 లక్షలకు చేరింది. గత డిసెంబర్ చివర్లో భారీగా పడిపోయిన వెండి రేట్లు, తాజా అనిశ్చితుల నేపథ్యంలో మళ్లీ రికార్డ్ స్థాయిల దిశగా పయనిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: