రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా రెండు రోజుల పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ (Global Summit 2025) సోమవారం (డిసెంబర్ 8) అట్టహాసంగా ప్రారంభం అయింది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ సదస్సును తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ లాంఛనంగా ప్రారంభించారు.
Read Also: Grama Panchayat Elections : పంచాయతీ ఎన్నికల్లో వారే అధికం!
తోలి రోజే, దాదాపు రూ.2.43లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 35MOUలపై సంతకాలు జరిగాయి. CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో నిన్న డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీని ద్వారా రాష్ట్రం ‘విజన్ 2047’ దిశగా వేగంగా పయనిస్తూ.. సుస్థిరమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక ఆకర్షణ
మరోవైపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Global Summit 2025) కు 44 పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన కంపెనీల నుంచి ప్రతినిధుల బృందాలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. అమెరికా నుంచే వివిధ కంపెనీలకు చెందిన 46 మంది ప్రతినిధులు వస్తున్నారు.
రెండు రోజుల సదస్సులో మొత్తం 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. అందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు సిద్ధం చేశారు. సదస్సు నిర్వహిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంగణమంతా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. కాగా తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్ సమిట్ డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లుతో కూడిన బహుమతిని అందించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: