ప్రస్తుతం గ్లోబల్ వర్క్ మార్కెట్‌లో ఇండియా నిపుణులకు కొత్త అవకాశాలు తేవడం మొదలైంది.ముఖ్యంగా అమెరికా H-1B వీసా (H-1B Visa) నిబంధనలను కఠినతరం చేసి, ఫీజులు భారీగా పెంచిన నేపథ్యంలో, జర్మనీ భారత నిపుణులకు రెడ్ కార్పెట్ విస్తరించింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను స్వాగతించడానికి జర్మనీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, వలస విధానం సులభంగా, స్థిరంగా, నమ్మకంగా ఉంటుందని ప్రకటించింది.
భారత్‌లో జర్మనీ (Germany) రాయబారిగా వ్యవహరిస్తున్న ఫిలిప్ అకెర్‌మన్ (Philip Ackerman) ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అత్యుత్తమ ప్రతిభావంతులను, కష్టపడి పనిచేసే వారిని జర్మనీ ఎప్పుడూ గౌరవిస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఐటీ, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో భారత నిపుణులకు అద్భుతమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

స్థానిక జర్మన్ల కంటే ఎక్కువ జీతాలు అందుకుంటున్నారని
జర్మనీలో పనిచేస్తున్న కొందరు భారతీయులు స్థానిక జర్మన్ల కంటే ఎక్కువ జీతాలు అందుకుంటున్నారని ఆయన వెల్లడించారు.తమ దేశ వలస విధానాన్ని జర్మన్ కార్లతో పోలుస్తూ అకెర్‌మన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మా ఇమ్మిగ్రేషన్ పాలసీ (Immigration Policy)జర్మన్ కార్ల లాంటిది. చాలా నమ్మకమైనది, ఆధునికమైనది. ఇందులో అమెరికాలో మాదిరిగా ఆకస్మిక మార్పులు, గందరగోళానికి తావుండదు. రాత్రికి రాత్రే విధానాలను ఆపేయడం లాంటివి మా దగ్గర జరగవు” అని ఆయన భరోసా ఇచ్చారు.
ప్రతిభావంతులైన భారతీయులు తమ దేశం అందిస్తున్న అవకాశాలను పరిశీలించాలని, తప్పకుండా ఆశ్చర్యపోతారని ఆయన పిలుపునిచ్చారు.భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం జర్మనీలో సుమారు 2,08,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. వచ్చే ఏడాదిలో జర్మనీ ప్రభుత్వం దాదాపు 2 లక్షల ప్రొఫెషనల్ వీసాలు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ఏకంగా 90,000 వీసాలు భారతీయులకే కేటాయించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: