Gen z: పాకిస్థాన్ (pakistan) ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో విద్యార్థుల నిరసనలు మరోసారి ఉద్రిక్తత సృష్టించాయి. ముజఫరాబాద్ విశ్వవిద్యాలయాల విద్యార్థులు అధిక ఫీజులు, కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ మార్కింగ్ విధానంపై ఆందోళనలు ప్రారంభించారు. మొదట ఈ నిరసనలు శాంతియుతంగా సాగినప్పటికీ, గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆగ్రహించిన విద్యార్థులు రోడ్లలో టైర్లకు నిప్పు వేసి, విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Read also: Miss Universe : విశ్వసుందరి పోటీల్లో హైడ్రామా

Gen z: పీఓకేలో పాక్ కు వ్యతిరేకంగా జెన్ జీ నిరసనలు..
విద్యార్థుల ఆందోళనలను
Gen z: ఈ ఉద్యమం నేపాల్, బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళనలను గుర్తుచేస్తోంది. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల పోరాటం కారణంగా షేక్ హసీనా సర్కారు, నేపాల్‌లో కేపీ ఓలీ సర్కారు రాజీనామా చేశారు. పీఓకేలో యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడం, ప్రధాని షరీఫ్ మరియు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లపై వ్యతిరేకత పెరగడం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఈ నిరసనలు ఎలాంటి మలుపు తీసుకుంటాయోనే ఆసక్తి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: