Gaza NGO ban : గాజాలోని పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ తీసుకుంటున్న తాజా నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు (NGOs) గాజాలో పనిచేయకుండా నిషేధం విధిస్తే తమ జీవితం పూర్తిగా నాశనమవుతుందని అక్కడి ప్రజలు హెచ్చరిస్తున్నారు.
ఖాన్ యూనిస్‌కు చెందిన సిరాజ్ అల్-మస్రీ మాట్లాడుతూ, “మాకు ఆదాయం లేదు, డబ్బు లేదు. ఈ సహాయ సంస్థలే మా ప్రాణాధారం. అవి లేకపోతే మేం ఎక్కడికి వెళ్లాలి?” అని ప్రశ్నించారు. ప్రస్తుతం గాజాలో కొద్ది వైద్య కేంద్రాలే పనిచేస్తున్నాయని, ఈ సంస్థలు నిషేధితమైతే గాయపడినవారు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు.
హమాస్‌తో సంబంధాలున్నాయనే నిరూపణలేని (Gaza NGO ban) ఆరోపణలతో, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (MSF), నార్వేజియన్ రిఫ్యూజీ కౌన్సిల్, CARE ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ సహా మొత్తం 37 అంతర్జాతీయ ఎన్జీఓల లైసెన్సులను రద్దు చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం, ఈ సంస్థలు తమ సిబ్బంది వివరాలు, కార్యకలాపాల సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతోంది.
Read also: Court Verdict: కుల్దీప్ సెంగార్ విడుదలపై సుప్రీంకోర్టు స్టే రద్దు
గాజాకు చెందిన రమ్జీ అబూ అల్-నీల్ మాట్లాడుతూ, “ఈ సహాయ సంస్థలు ఉన్నప్పటికీ పరిస్థితి దారుణంగానే ఉంది. అవే లేకపోతే పిల్లలు చనిపోతారు, కుటుంబాలు పూర్తిగా కూలిపోతాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కెనడా, ఫ్రాన్స్, జపాన్, బ్రిటన్ సహా 10 దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గాజాలో ఎన్జీఓలు నిర్బంధాలు లేకుండా పనిచేసే అవకాశం కల్పించాలని వారు ఇజ్రాయెల్‌ను కోరారు.
యునైటెడ్ నేషన్స్ పాలస్తీనా శరణార్థుల సంస్థ (UNRWA) కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. ఇది మానవతా సహాయ కార్యక్రమాలను మరింత దెబ్బతీస్తుందని, అంతర్జాతీయ మానవతా చట్టాలకు ఇది విరుద్ధమని UNRWA చీఫ్ ఫిలిప్ లాజారిని హెచ్చరించారు.
గత రెండు సంవత్సరాల యుద్ధంలో దాదాపు 500 మంది సహాయక సిబ్బంది మరణించారని గాజా మీడియా కార్యాలయం తెలిపింది. ఇజ్రాయెల్ తాజా నిషేధం కాల్పుల విరమణ ఒప్పందానికి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల శాంతి ప్రణాళికకు కూడా విరుద్ధమని విశ్లేషకులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: