అమెరికా – చైనా పనామా మీదుగా తీవ్ర వివాదం నడుస్తోంది. పనామా కెనాల్‌పై చైనా ఆధిపత్యం గురించి ముందు నుంచి మాట్లాడుతున్న ట్రంప్, అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయ్యాక స్వరం పెంచారు. ఓ ఒప్పందంలో భాగంగా పనామా దేశానికి అప్పగించిన కెనాల్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామనే వరకూ వెళ్లారు. ఈ క్రమంలో యూఎస్, పనామా సంబంధాలపై చాలా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా యూఎస్ ప్రభుత్వ నౌకలు ఫీజు చెల్లించకుండా పనామా కాలువ నుంచి వెళ్లేందుకు అంగీకరించినట్లు వచ్చిన వార్తలను పనామా ఖండించింది.

ఇలాంటి ఒప్పందం కుదిరిందనీ, దీని వల్ల అమెరికా ప్రభుత్వానికి మిలియన్ డాలర్లు ఆదా అవుతాయని యూఎస్ ప్రభుత్వం చెప్పడంతో.. పనామా ఈ ప్రకటన చేసింది. కాలువను ఉపయోగించుకోవడానికి టోల్, ఫీజులు నిర్ణయించే ప్రత్యేక అధికారం తమకు ఉందని పనామా కెనాల్ అథారిటీ స్పష్టం చేసింది. ఈ ఛార్జీల్లో ఎలాంటి మార్పులూ చేయలేదని కూడా తెలిపింది.