జపాన్ సోషలిస్టు పార్టీ నేత, మాజీ ప్రధాని తొమిచి మురయమ(Tomiichi Murayama) ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 101 ఏళ్లు. ఓయిటా సిటీలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1924 మార్చి 3వ తేదీన ఆయన ఓయిటా జిల్లాలో జన్మించారు. 1938లో ఆయన టోక్యోకు వలస వెళ్లారు. ఆ తర్వాత సైనిక దళాల్లో చేరారు. రెండో ప్రపంచ యుద్ధంలో కుమమోటో వద్ద విధులు నిర్వర్తించారు. 1972లో ఆయన తొలిసారి దిగువ సభకు ఎన్నికయ్యారు. జపాన్ సోషలిస్టు పార్టీకి ఆయన 1993లో చైర్మన్ అయ్యారు. 1994, జూన్ 29వ తేదీన జపాన్ 81వ ప్రధానిగా తొమిచి మురయమ(Tomiichi Murayama)మురియమ బాధ్యతలు స్వీకరించారు.
Read Also: Trump: హమాస్ రక్తపాతంపై ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

రెండో ప్రపంచ యుద్ధానికి 50 ఏళ్లు ముగిసిన సందర్భంగా 1995లో జరిగిన కార్యక్రమంలో యురయమ ఓ ప్రకటన చేశారు. తప్పుడు జాతీయ విధానం వల్ల జపాన్ యుద్ధ కాంక్షను ప్రదర్శించినట్లు చెప్పారు. దీంతో జపాన్ ప్రజలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లినట్లు చెప్పారు. తమ వల్ల అనేక దేశాల ప్రజలు, ముఖ్యంగా ఆసియా దేశాల్లో డ్యామేజ్ ఎక్కువగా జరిగిందన్నారు. 2000 సంవత్సరంలో ఆయన రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.
తోమిచి మురయామా ప్రారంభ జీవితం మరియు విద్య?
ఓయిటా ప్రిఫెక్చర్‌లో జన్మించిన మురాయామా 1946లో మీజీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు మరియు తన స్వస్థలమైన ప్రిఫెక్చర్‌లో కార్మిక సంఘం అధికారి అయ్యాడు. అతను 1955లో జపాన్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడిగా ఓయిటా సిటీ కౌన్సిల్‌కు ఎన్నికయ్యాడు; ఆ తర్వాత 1963లో ఓయిటా ప్రిఫెక్చురల్ అసెంబ్లీకి మరియు 1972లో నేషనల్ డైట్‌కు ఎన్నికయ్యాడు.
తోమిచి మురయామా రాజకీయ జీవితం?
టోమిచి మురయామా 1994 నుండి 1996 వరకు జపాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక జపనీస్ రాజకీయ నాయకుడు. 1948లో టెట్సు కటయామా తర్వాత ఆయన దేశానికి మొట్టమొదటి సోషలిస్ట్ ప్రధానమంత్రి , మరియు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 50వ వార్షికోత్సవం సందర్భంగా మురయామా ప్రకటన ద్వారా ఆయనను బాగా గుర్తుండిపోతారు , దీనిలో ఆయన జపాన్ గత వలస యుద్ధాలు మరియు దురాక్రమణకు అధికారికంగా క్షమాపణలు చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: