ఉత్తర చైనాలో గత వారంరోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా బీజింగ్ (Beijing)నగరంలో భారీ వర్షాల ప్రభావంతో తీవ్ర వరద (Floods) పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారుల ప్రకారం, ఈ వర్షాల వల్ల ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది మియిన్‌యున్ జిల్లాకి చెందారు. మరోవైపు యాన్కింగ్ వంటి ప్రాంతాల్లో కూడా మృతులు నమోదయ్యారు.సహాయక చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశించారు. అధికారులు హయ్యెస్ట్ ఫ్లడ్ ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటి వరకు 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొన్ని రోజుల పాటు బీజింగ్ పరిసర ప్రాంతాల్లో వరదలు రానున్నాయి. సుమారు 130 గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. డజన్ల సంఖ్యలో రోడ్లు కొట్టుకుపోయాయి. జలమయమైన ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని రెస్క్యూ చేస్తున్నారు. వరద (Floods)ల్లో మిస్సైన వారిని రక్షించాలని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆదేశించారు. సాధారణంగా ఈ సీజన్‌లో బీజింగ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తుంటాయి. 2012లో జూలైలో వచ్చిన వరదల (Floods)వల్ల 79 మంది మృతిచెందారు.

రికవరీ చర్యల కోసం చైనా ప్రభుత్వం ఇప్పటికే 200 మిలియన్ల యువాన్ల నిధిని కేటాయించింది. డ్యామేజ్ అయిన రోడ్లు, నీటి కేంద్రాలు, వైద్యం, మౌళిక సదుపాయాల కోసం ఖర్చు చేయనున్నారు. మియున్ ముజియా విమానాశ్రయం నుంచి వరద బాధితుల కోసం ఆహార పదార్ధాలను తీసుకెళ్లారు. లైఫ్ జాకెట్లను అందిస్తున్నారు. సాధారణంగా ఈ సీజన్‌లో బీజింగ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తుంటాయి. 2012లో జూలైలో వచ్చిన వరదల వల్ల 79 మంది మృతిచెందారు.
చైనాలో వరదలకు కారణం ఏమిటి?
ఇటీవలి సంవత్సరాలలో ఉత్తర చైనాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది, దీని వలన బీజింగ్‌తో సహా జనసాంద్రత కలిగిన నగరాలు వరద ప్రమాదాలకు గురయ్యాయి. చైనాలోని సాధారణంగా శుష్క ఉత్తర ప్రాంతంలో వర్షపాతం పెరగడానికి కొంతమంది శాస్త్రవేత్తలు గ్లోబల్ వార్మింగ్ కారణమని చెబుతున్నారు.
బీజింగ్లో ఏ ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి?
ఈ తీవ్రమైన వాతావరణం కారణంగా చైనా భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, కరువులు, తుఫానులు, అడవి మంటలు వంటి అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలకు గురవుతోంది. ఈ ప్రమాదాలన్నింటిలో, కరువులు, వరదలు, భూకంపాలు మరియు తుఫానులు అత్యంత వినాశకరమైనవి.
చైనా వరదలను ఎలా ఎదుర్కొంటుంది?
చైనాలో మొత్తం వరద నిర్వహణ వ్యూహం ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది: (i) ఎగువ ప్రాంతాలలో వరద నీటిని సాధ్యమైనంతవరకు నిల్వ చేయడం; (ii) ప్రధాన నదుల మధ్య మరియు దిగువ ప్రవాహాలలో సాధారణ వరదల నుండి వరద పీడిత ప్రాంతాలను రక్షించడం; (iii) కట్టలను మరియు నిల్వ మరియు నిర్బంధాన్ని సంయుక్తంగా ఉపయోగించడం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Operation Mahadev: పహల్గాం ఉగ్రవాదులు మావాళ్లే.. అడ్డంగా