ఇటీవల కాలంలో ప్రకృతిలో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయపరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రకృతి బీభత్సానికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. (Floods) మొరాకోలోని తీరప్రాంతమైన సాఫీ (safi) నగరంలో కురిసిన భారీ అకస్మాత్తు వర్షానికి 21 మంది మరణించారు.
Read Also: Trump: భారత్ లో చిక్కుకుపోయిన హెచ్-1బీ వీసాదారులకు షాక్ మీద షాక్ లు

సాఫీలో ప్రకృతి విధ్వంసం
మొరాకో రాజధాని రబాత్ నుంచి 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాఫీ ప్రావిన్స్ పాతనగరంలో ఓ గంటపాటు ఎడతెరపిలేకుండా భారీ కుంభవృష్టి కురిసింది. అనుకోకుండా కురిసిన వర్షబీభత్సానికి సాఫీలో ఆకస్మిక వరదలు సంభవించాయి.ఈ వరదల వల్ల అనేక ఇళ్లు, దుకాణాలు నీట మునిగాయి. ఒక్కసారిగా వచ్చిన వర్షం వల్ల నదుల్లోని నీటిమట్టం పెరిగి, కార్లు కొట్టుకుపోయాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. వరదల్లో అనేకులు గల్లంతు అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు 21మంది మరణించారని, 32మంది గాయపడ్డారని ఆ దేశపు అధికారులు తెలిపారు.
రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు
రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనివల్ల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని, ప్రభుత్వం హెచ్చరిక జారీచేసింది. సాఫీ ప్రాంతంలో గత ఏడేళ్లుగా తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నదుల్లో నీటిమట్టం అడుగట్టిపోయింది. ఏడేళ్ల తర్వాత ఇంత భారీగా వర్షాలు కురవడంతో నదుల్లో నీటిమట్టం ఆకస్మాత్తుగా పెరిగి వరదలు సంభవించాయి. ముందస్తు హెచ్చరికలు లేనందున వరదల వల్ల ఇళ్లు కూలిపోయాయి. వంతెనలు తెగిపోయాయి. అంతేకాక మౌలిక సదుపాయాలకు తీవ్రనష్టం వాటిల్లినట్లు ఇక్కడి అధికారులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: