అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆరోగ్య సంస్థ అయిన అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (American Medical Association (AMA) అధ్యక్ష పదవికి తొలిసారిగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఎన్నికయ్యారు. శ్రీనివాస్ ముక్కమల (Srinivas Mukkamala) అనే వైద్య నిపుణుడు ఈ ఘనత సాధించారు. 178 ఏళ్ల నాటివున్న AMA చరిత్రలో ఇది ఒక మైలురాయి. ఆయనను అధికారికంగా చికాగోలో జరిగిన ఈవెంట్లో AMA ప్రెసిడెంట్‌గా ప్రకటించారు. ఆయన్ను ఎన్నుకోవడం పట్ల వైద్య వర్గాలు అభినందనలు తెలుపుతున్నాయి.
వైద్య సేవల్లో నిఖార్సైన సేవలు
డాక్టర్ శ్రీనివాస్ ముక్కమల ఆరోగ్య రంగంలో ఆర్గనైజ్డ్ మెడిసిన్ విభాగంలో ఎంతో కాలంగా సేవలందిస్తున్నారు. అనేకమంది రోగులకు అత్యుత్తమ చికిత్సను అందించడంలో ఆయన విశేష కృషి చేశారు. AMA కూడా ఆయన సేవలను ప్రశంసిస్తూ – “వైద్యులకు మార్గదర్శకుడిగా, ఆరోగ్య పరిరక్షణలో మార్గాన్ని చూపిన వ్యక్తి” అంటూ కొనియాడింది. వైద్య విధానాల్లో నూతన ఆవిష్కరణలు, మెరుగైన సేవల కోసం ఆయన చేసిన కృషి విలక్షణమైనదిగా గుర్తించారు.
బ్రెయిన్ క్యాన్సర్‌ను జయించిన సమర్థవంతుడు
ఇటీవల డాక్టర్ శ్రీనివాస్ ముక్కమల బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడ్డారు. అయితే ఆయన దాన్ని విజయవంతంగా జయించి మళ్లీ సామాజిక సేవల్లోకి అడుగుపెట్టారు. ఇది ఆయన mentall strength, determinationకు నిదర్శనమని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. AMA ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, అమెరికా ఆరోగ్య వ్యవస్థలో సమానత్వం, నాణ్యత, అందుబాటులో మెరుగులు తీసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Read Also : Modi : మోదీ సర్కార్ జవాన్లను అవమానించింది – కాంగ్రెస్