
హాంకాంగ్‌లో ఇటీవల జరిగిన ఘోర అగ్నిప్రమాదం(Fire Accident) దేశాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ ఘటనలో ఏకంగా ఏడు భారీ నివాస భవనాలు దగ్ధం కాగా, 128 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన అగ్నిప్రమాదానికి ఒక సిగరెట్ పీక కారణమైందన్న ప్రచారం సోషల్ మీడియాలో తీవ్రంగా జరుగుతోంది.
Read Also: Floods: థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి

అగ్ని ప్రమాదానికి కారణంపై అనుమానాలు
మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో, కార్మికుల్లో ఒకరు కాల్చి పడేసిన సిగరెట్ పీక వల్లే నిప్పు అంటుకుందని, క్షణాల వ్యవధిలోనే మంటలు భారీగా ఎగసిపడ్డాయని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం(Fire Accident) జరిగిన ప్రదేశంలోనే ఒక కార్మికుడు సిగరెట్ కాలుస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి తాజాగా బయటపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అగ్ని ప్రమాదానికి కారణం ఆ కార్మికుడు కాల్చిన సిగరెట్ పీకేనని ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ ప్రచారాన్ని అధికారులు మాత్రం నిర్ధారించలేదు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు.
ప్రమాద స్థలం వివరాలు
ఈ ప్రమాదం తైపోలోని వాంగ్ ఫక్ కోర్ట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో జరిగింది. 1983లో నిర్మించిన ఈ కాంప్లెక్స్‌లో ఒక్కో టవర్ 31 అంతస్తుల చొప్పున మొత్తం ఎనిమిది భారీ టవర్లు ఉన్నాయి. మొత్తంగా 2 వేలకు పైగా ఫ్లాట్‌లు ఉన్నాయి. ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదంలో ఇందులోని ఏడు టవర్లు బుగ్గిపాలయ్యాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: