ప్రపంచ ఉగ్రవాద నిధుల పరిశీలక సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) పాకిస్థాన్‌కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలు, మనీలాండరింగ్‌పై ఆర్థిక చర్యలు తీవ్రంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. 2022 అక్టోబరులో గ్రేలిస్టు నుంచి బయటపడినప్పటికీ, అది ఉగ్రవాద నిధులు, మనీలాండరింగ్‌కు ‘బుల్లెట్ ప్రూఫ్’ కాదని స్పష్టం చేసింది. ఎఫ్‌ఏటీఎఫ్ అధ్యక్షురాలు ఎలిసా డి అండా మద్రాజో, ఫ్రాన్స్‌లో జరిగిన ప్రెస్మీట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో పాటు అన్ని దేశాలు ఈ చర్యలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఇటీవల వెలుగుతున్న నిఘా నివేదికల ప్రకారం, పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు డిజిటల్ వాలెట్లు, డిజిటల్ ఫైనాన్స్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తు న్నాయి. ఇది ఉగ్రవాద నెట్‌వర్క్‌లను మరింత సులభతరం చేస్తోందని ఎఫ్‌ఏటీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.
Read Also: Piyush Goyal: సుంకాలపై ట్రంప్ బెదిరింపులు..భారత్ ఎవరికీ తలొగ్గదు

మహిళలకు ఉగ్రవాదం పై ఆన్‌లైన్ కోర్సులు
“మా ఇంటెల్ నివేదికల ప్రకారం, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడంతో పాటు వాటి సౌకర్యాల కోసం డిజిటల్ వాలెట్లను ఉపయోగిస్తున్నారు” అని మద్రాజో చెప్పారు. ఈ డిజిటల్ పద్ధతులు ట్రాకింగ్‌ను కష్టతరం చేస్తున్నాయని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారిందని హెచ్చరించారు. జైష్-ఇ-మహమ్మద్ (జెఎమ్) ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజ్హర్ దగ్గరి బంధువులు మహిళలకు ఉగ్రవాదం పై ఆన్‌లైన్ కోర్సులు నిర్వహిస్తున్నారనే వార్తలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ కోర్సులకు నిధులు కూడా సమకూరుస్తున్నారని నివేదికలు తెలిపాయి.
ఆఫ్ఘనిస్తాన్, గల్ఫ్ దేశాలకు నిధులు బదిలీ
డిజిటల్ వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, క్రిప్టో ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి కారాచీ, క్వెట్టా, పెషావర్‌లోని హ్యాండిలర్ల నుంచి ఆఫ్ఘనిస్తాన్, గల్ఫ్ దేశాలకు నిధులు బదిలీ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్టులు బయటపడ్డాయి. ఈపేసీపై, సదాపే వంటి డిజిటల్ వాలెట్లు ఫేక్ ఐడీలు, ఫ్రంట్ ఎన్‌జీఓలతో లింక్ చేసి ఉపయోగిస్తున్నారు. హవాలా నెట్‌వర్క్‌లపై ఎఫ్‌ఏటీఎఫ్ కట్టుబాట్లు తీవ్రమైన తర్వాత ఈ డిజిటల్ పద్ధతులకు మారారని తెలుస్తోంది.
భారత్ నివేదికలు దీనికి ఆధారం
పాకిస్థాన్‌లో రాష్ట్ర పోషిత ఉగ్రవాదం, ప్రాపగేషన్ ఫైనాన్సింగ్ ముప్పులు ఇంకా ఉన్నాయని, భారత్ నివేదికలు దీనికి ఆధారం అవుతున్నాయని తెలిపారు. ఎఫ్‌ఏటీఎఫ్ జూలై 2025 నివేదికలో డిజిటల్ టెక్నాలజీలు సాంప్రదాయ పద్ధతులతో కలిసి ఉగ్రవాద నిధులను మరింత సంక్లిష్టం చేస్తున్నాయని, ట్రాకింగ్ కష్టమవుతోందని హెచ్చరించింది. ‘కాంప్రహెన్సివ్ అప్‌డేట్ ఆన్ టెరరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్స్’ రిపోర్ట్‌లో ఈ ఆందోళనలు వివరంగా ఉన్నాయి.
పాకిస్థాన్‌పై పరిశీలన కొనసాగుతోంది:మద్రాజో
ఎఫ్‌ఏటీఎఫ్ అధ్యక్షురాలు మద్రాజో, “మా లక్ష్యం సరళం – ఉగ్రవాదులు, క్రిమినల్స్‌కు వారి అవసరమైన నిధులను దక్కలేదు చేయడం. ప్రపంచవ్యాప్తంగా మా స్టాండర్డ్‌లను బలోపేతం చేస్తూ, అమలును పరిశీలిస్తూ మా నిబద్ధత కొనసాగుతుంది,” అని చెప్పారు. సెప్టెంబర్-అక్టోబర్ ప్లీనరీ సమావేశాల తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి. బర్కినా ఫాసో, మొజాంబిక్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలను గ్రేలిస్టు నుంచి తొలగించినా, పాకిస్థాన్‌పై పరిశీలన కొనసాగుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: