हिन्दी | Epaper

బంగారు గనిలో ఘోర ప్రమాదం: 10 మంది మృతి

Vanipushpa
బంగారు గనిలో ఘోర ప్రమాదం: 10 మంది మృతి

పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో ఘోర ప్రమాదం సంభవించింది. మాలిలోని కౌలికోరో ప్రాంతంలో ఉన్న బంగారు గనిలో కొండచరియలు విరిగిపడడంతో 10 మంది మృతి చెందారు. పలువురి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. బుధవారం ఈ ఘటన జరిగిందని అక్కడి గవర్నర్ కల్నల్ లామైన్ కపోరో సనొగో వెల్లడించారు. బంగారం వెతుకులాటకు వెళ్లి వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారని పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. గనిలోకి ఒక్కసారిగా బురద నీరు ప్రవేశించి వారిని చుట్టిముట్టింది. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకునిపోయారని, వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని గవర్నర్ తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గని కూలడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.

ఆఫ్రికా దేశాల్లో మూడో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా ఉన్న మాలిలో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. గతేడాది కూడా ఇదే ప్రాంతంలోని కంగబా జిల్లాలో బంగారు గని కుప్పకూలి.. 70 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఎలాంటి భద్రతా చర్యలను పాటించకుండా అక్రమ మైనింగ్ కు పాల్పడుతుండడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మైనింగ్ రంగంలో చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ భారీ ప్రమాదంపై ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

సరైన సమయంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్

సరైన సమయంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

గల్ఫ్ దేశాల్లో తాగునీటి ప్లాంట్లుపై దాడికి యత్నం

గల్ఫ్ దేశాల్లో తాగునీటి ప్లాంట్లుపై దాడికి యత్నం

📢 For Advertisement Booking: 98481 12870