EU ACI bazooka : అమెరికా–యూరప్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు Donald Trump గ్రీన్‌లాండ్ అంశంలో వెనక్కి తగ్గడం లేదని, యూరప్ దేశాలపై టారిఫ్‌ల బెదిరింపులతో స్పష్టమవుతోంది. ఫిబ్రవరి 1 నుంచి డెన్మార్క్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, నార్వే, నెదర్లాండ్స్, జర్మనీ, స్వీడన్, యూకే నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 10 శాతం దిగుమతి సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అవసరమైతే జూన్ 1 నుంచి ఈ పన్నును 25 శాతానికి పెంచుతామని కూడా హెచ్చరించారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై European Union తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది బహిరంగ బ్లాక్‌మెయిలింగ్ చర్యగా ఈయూ అభివర్ణిస్తోంది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ యూనియన్ శక్తివంతమైన యాంటీ కోర్సన్ ఇన్‌స్ట్రూమెంట్ (ACI) ను ప్రయోగించేందుకు (EU ACI bazooka) సిద్ధమవుతోంది. ఇతర దేశాల ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు రూపొందించిన ఈ సాధనాన్ని 2023 డిసెంబర్‌లో అమల్లోకి తీసుకువచ్చారు. అయితే ఇప్పటివరకు ఏ దేశంపై కూడా దీనిని వినియోగించలేదు. ఇప్పుడు తొలిసారిగా అమెరికాపై ఈ ‘బజూకా’ ప్రయోగం జరిగే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also: Movies: OTTలోకి కొత్త సినిమాలు

అమెరికాపై ACI అమలైతే ఆ దేశం నుంచి యూరప్‌కు వచ్చే వస్తువులపై భారీ సుంకాలు విధించబడతాయి. ముఖ్యంగా బోర్బన్ విస్కీ, హార్లే డేవిడ్సన్ బైక్‌లు, వ్యవసాయ ఉత్పత్తులు ఈ ఆంక్షల ప్రభావానికి లోనయ్యే అవకాశముంది. దీనికి ప్రతిగా అమెరికా కూడా యూరప్‌పై టారిఫ్‌లు పెంచితే, పరిస్థితి పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: