గ్రీన్‌ల్యాండ్ అంశం అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి దుమారం రేపుతోంది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే (Mark Rutte) ఆదివారం (స్థానిక కాలమానం ప్రకారం) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గ్రీన్‌ల్యాండ్, ఆర్కిటిక్ భద్రతా పరిస్థితులపై ఫోన్‌లో చర్చించారు. ఈ సంభాషణ వివరాలను రుట్టే వెల్లడించకపోయినా, ఈ వారం దావోస్‌లో ట్రంప్‌ను కలవనున్నట్లు తెలిపారు. “గ్రీన్‌ల్యాండ్, ఆర్కిటిక్ భద్రతపై అధ్యక్షుడితో మాట్లాడాను. ఈ అంశంపై కలిసి పని కొనసాగిస్తాం. దావోస్‌లో ఆయనను కలవడం కోసం ఎదురు చూస్తున్నాను” అంటూ రుట్టే ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Read Also: Iran Protests: అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం

పలు దేశాల పూర్తి సంఘీభావం
ఇదిలా ఉండగా, గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలన్న తన డిమాండ్‌కు యూరోపియన్ దేశాలు అంగీకరించకపోతే టారిఫ్‌లు విధిస్తామంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలపై యూరప్ గట్టిగా స్పందిస్తోంది. డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్‌కు మద్దతుగా పలు యూరోపియన్ దేశాలు ఏకమయ్యాయి. ట్రంప్ శనివారం యునైటెడ్ కింగ్‌డమ్ సహా యూరోపియన్ దేశాలపై టారిఫ్ హెచ్చరికలు జారీ చేశారు. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పుకోకపోతే, 2026 ఫిబ్రవరి 1 నుంచి 10 శాతం టారిఫ్‌లు, జూన్ 1 నుంచి వాటిని 25 శాతానికి పెంచుతామని ప్రకటించారు. “డెన్మార్క్ ఎన్నేళ్లుగా అమెరికా మద్దతు పొందింది. ఇప్పుడు గ్రీన్‌ల్యాండ్‌ను తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. జాతీయ భద్రత కారణంగానే ఈ నిర్ణయమని, గ్రీన్‌ల్యాండ్‌పై చైనా, రష్యాల ఆసక్తి పెరుగుతోందని ఆయన వాదించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: