పాకిస్థాన్ అంటేనే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశమని మనకు తెలుసు. భారతదేశంపై ఉగ్రదాడులకు అవకాశం దొరికిన ప్రతిసారి దాడులకు పాల్పడుతూనే ఉంటుంది. పహల్గాంలో ఉగ్రవాదులు 26మందిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ దాడులు తమ దేశానికి ఏమాత్రం సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తున్నది. అయితే ఐక్యరాజ్యసమితి వేదికగా భారత రాయబారి ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ (Eldos Mathew Punnus) పాకిస్తాన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచశాంతికి, భద్రతకు పాకిస్తాన్ ఒక ముప్పు అని ఆయన నిర్మోహమాటంగా అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ఆరోపణలు చేయడం వంటి దుశ్చర్యలను ఆయన ఎండగట్టారు. బుధవారం ఐరాస సమావేశంలో భారత్ రాయబారి ఎల్డోస్ మాథ్యూ మాట్లాడుతూ పాకిస్తాన్ లో మైనారిటీ మహిళలపై లైంగిక హింస నేటికీ కొనసాగుతోందని, వేలాదిమంది మహిళలపై దారుణమైన నేరాలకు పాల్పడిన చరిత్ర పాక్ సైన్యానిదని ఆయన ఆరోపించారు. ఐరాస వేదికగా మాథ్యూ మాట్లాడుతూ పాకిస్తాన్లో నేటికీ మహిళలపై దురాగతాలు కొనసాగుతున్నాయన్నారు.
మహిళలపై పాక్ సైన్యం లైంగిక హింస
1971లో మునుపటి తూర్పు పాకిస్తాన్లో వేలాది మంది మైనారిటీ వర్గాల మహిళలపై దారుణమైన లైంగిక హింసకు పాల్పడిన చరిత్ర పాక్ సైన్యానిదని ఆయన అన్నారు. నిందితులపై ఇప్పటివరకు ఎలాంటి శిక్షలు విధించకపోవడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ‘బలహీన వర్గాల మహిళల బలవంతపు మతమార్పిడిలు (Forced conversions of women), అక్రమ రవాణా, బాల్యవివాహాలు, లైంగిక హింసలకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్తోపాటు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు తమ నివేదికల్లో వివరించాయి’ అని ఐరాసలో ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ వెల్లడించారు.
పాక్ అసంబద్ధ ఆరోపణలను ఖండించిన మాథ్యూ
ఐరాసలో మాథ్యూ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పై పాకిస్తాన్ అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నది, జమ్మూకాశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో,అంతర్భాగమని అన్నారు. భారతదేశ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు పాకిస్తాన్కు లేదని ఆయన అన్నారు. పాకిస్తాన్ప ఉగ్రవాద ఆరోపణలు చేస్తూ, ఆదేశం ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని, సరిహద్దు ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటుందని మాథ్యూ ఆరోపించారు. పహల్గాంలో ఉగ్రవాదులను ఊసిగొల్పి
26మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నారని అన్నారు. ఆ కుటుంబాలు పెద్దదిక్కు లేకుండా పోయిందని, పాక్ మాత్రం ఈ దాడులతో తమకు ఏమాత్రం సంబంధం లేదని బుకాయిస్తుందని ఆయన అన్నారు. సింధునది జలాల కోసం ఒకవైపు తమను ఆడుక్కుంటూనే మరోవైపు మళ్లీ యుద్ధానికి సిద్ధమని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అని మాథ్యూ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: