ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్(Richter scale) 6.9తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఆ భూకంపం ధాటికి పలు ఇళ్లు, బహుళ అంతస్తున భవనాలు ధ్వంసమయ్యాయి. మొత్తం ఇప్పటివరకు 69మంది మరణించినట్లు ఇక్కడి అధికారులు తెలిపారు. 147 మంది గాయపడ్డారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
Read Also : Liquor: రేపు మద్యం దుకాణాల బంద్ తో.. కోట్లల్లో అమ్మకాలు

అలాగే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.
భూకంపం ధాటికి ఇళ్లల నుంచి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. బోగో నగరంలో అత్యధికంగా 14మంది మరణించారు. ఇక్కడ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. దాన్బంటాయన్ సమీపంలో ఉన్న చారిత్రక రోమన్ కాథలిక్ చర్చి తీవ్రంగా దెబ్బతినట్లు అధికారులు తెలిపారు. విరిగిపడ్డ కొండచెరియలు భూ ప్రకంపనల ధాటికి చాలా గ్రామాలు, పట్టణాలు దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రహదారులు బీటలు వారాయి. పర్వత ప్రాంతాలలో(mountainous areas) ఉన్న గ్రామాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ కొందరు మరణించినట్లు, అనేకులు గాయపడినట్లుగా తెలుస్తోంది. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలకు దిగారు. ప్రకృతి వైపరీత్యాలకు ఫిలిప్పీన్స్ కేంద్ర బిందువు పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో ఉన్నందున ఈ దేశంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలు కావడం వంటివి జరుగుతుంటాయి. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసి చేసిని ఆ దేశం, తర్వాత వాటిని ఉపసంహరించుకుంది.
ఫిలిప్పీన్స్‌లో ఎప్పుడు భూకంపం సంభవించింది?
ఇటీవల 6.9 తీవ్రతతో భూకంపం సంభవించి దేశాన్ని అతలాకుతలం చేసింది.
ఈ భూకంపం వల్ల ఎంతమంది మృతులు సంభవించారు?
అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 69మంది మృతి చెందగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: