ఆఫ్ఘనిస్థాన్ లోశనివారం అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత, ప్రజలుగాఢ నిద్రలో ఉండగా, రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రతతో భూమి కంపించింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:33 గంటలకు ఈ భూకంపంసంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ (National Center for SeaScology) (ఎన్సిఎస్) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 87 కిలోమీర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.దీనివల్ల ప్రకంపనలు చాలా ప్రాంతాలకు వ్యాపించాయి. భూమి కంపించడంతో ఇళ్లల్లోని వస్తువులు కదిలాయి. నిద్రలో ఉన్న ప్రజలు అరుపులు, కేకలతో బయటికి పరుగులు తీశారు.
పూర్తి వివరాలు
ప్రధాన భూకంపం తరటువాత కూడా కొన్ని స్వల్ప ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు చాలాసేపు ఇళ్లలో వెళ్లడానికిభయపడ్డారు. రోడ్లమీద, బహిరంగ ప్రదేశాల్లోనే గడిపారు.ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తినష్టం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికి అధికారులు నష్టాన్ని అంచనా వేసే పనిలోఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్థాన్లో (Afghanistan) వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. వారం రోజుల్లో ఇది నాలుగో భూకంపం. హిందూ కుష్ పర్వతశ్రేణి,భౌగోళికంగా చురుకైన ప్రాంతం కావడంతో ఇక్కడ తరచుగా భూకంపాలు వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.
1,500 మందిపైగా బలిగొన్న భారీ భూకంపం
2023 అక్టోబర్ లోని భూకంపంవల్ల 1,500 మందికి పైగా మరణించారు. అటువంటి వినాశకరమైన ఘటనలు మళ్లీ జరుగుతాయేమోనని ప్రజలు భయపడుతున్నారు. దేశం ఇప్పటికే ఆర్థిక, సామాజిక సమస్యలతో సతమతమవుతున్నందున, ఈ వరుస భూకంపాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.పెరుగుతున్న భూకంపాలు,ఇటీవల తరచూ భూకంపాలు పెరుగుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్, మయన్మార్, థాయ్ ల్యాండ్, రష్యా, జపాన్దేశాలలో భారీ భూకంపాలు
సంభవించాయి. మూడురోజుల క్రితం రష్యాలో భారీస్థాయిలో భూకంపం సంభవించింది. భారీగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లిన్న సంగతి తెలిసిందే.ప్రత్యేకంగా సముద్రప్రాంతాలకు సమీపదేశాలు తరచుగా సునామీ, భూకంపాలకు గురవుతున్నాయి. సునామీవల్ల కూడా చైనా, రష్యా, జపాన్ దేశాలు అధికంగా నష్టపోతున్నాయి.
భూకంపం అంటే ఏమిటి?
భూకంపం అనేది భూమి అంతర్గత పొరల్లో సంభవించే ప్రకంపనల వల్ల నేల కంపించడాన్ని సూచిస్తుంది. ఇది ఒక సహజ విపత్తు.
భూకంపానికి ప్రధాన కారణాలు ఏమిటి?
భూమి టెక్టానిక్ ప్లేట్లు కదలికలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూగర్భ గుహల కూలిపోవడం వంటి కారణాలు భూకంపానికి దారి తీస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: