నిత్యం ఎండలతో భగభగలాడే ఏడారి దేశంలో వర్షాలు కురిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో! కానీ అదే వర్షం భారీగా కురిస్తే, జనజీవనం స్తంభించిపోతుంది. అకస్మాత్తుగా వరదలు వచ్చి, భారీ నష్టానికి దారితీస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. (Dubai) యుఎఇలోని అనేక ప్రాంతాలకు భారీ వర్షాలు అల్లాడిస్తున్నాయి. దుబాయ్, అబుదాబీతో(AbuDhabi) పాటు అనేక నగరాలను గురు, శుక్రవారాల్లో భారీ వానలు ముంచెత్తడంతో కొన్ని గంటల పాటు జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది.
Read also: India: అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్

పలు విమానాలకు అంతరాయం
శుక్రవారం పలు విమాన సర్వీసులకు అంతరాయం కలగడంతో ఆలస్యంగా నడిచాయి.(Dubai) దుబాయ్, అబుదాబీల్లో అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని దుబాయ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. దోహా, ఖతార్ లలో భారీ వానలతో పరిస్థితి అధ్వానంగా మారింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలను చేపట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: