Dubai gold price : సాధారణంగా పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లోనే బంగారం, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులపై భారీ డిస్కౌంట్లు కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల కారణంగా దుబాయ్‌లో బంగారం ధరల్లో అనూహ్యమైన తగ్గుదల కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే అక్కడ బంగారం తక్కువ ధరకు లభిస్తోంది.
ఔన్సుకు 30 డాలర్ల తగ్గింపు
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర సుమారు 5,147 డాలర్ల వద్ద ఉంది. అయితే దుబాయ్‌లో అదే బంగారాన్ని దాదాపు 30 డాలర్లు (సుమారు రూ.2,700) తక్కువకు విక్రయిస్తున్నారు. ఈ తగ్గింపు ప్రధానంగా బులియన్ వ్యాపారులు, పెద్ద సంస్థలకు వర్తిస్తోంది.
యుద్ధ ప్రభావం, రవాణా వ్యవస్థ స్తంభన
ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో గల్ఫ్ ప్రాంతంలో విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో నడవడం లేదు. సాధారణంగా ప్రయాణికుల విమానాల్లోని కార్గో విభాగంలో బంగారం రవాణా చేస్తారు. కానీ ఇప్పుడు గగనతల పరిమితులు కారణంగా సరుకు రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి.
Read Also: Israel Iran War: 50 యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి

పెరిగిన బీమా, రవాణా ఖర్చులు
యుద్ధ పరిస్థితుల కారణంగా సరుకు రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు వెనుకడుగు వేస్తున్నారు. స్టాక్ ఎక్కువకాలం నిల్వ ఉండిపోతే నష్టాలు వస్తాయన్న భయంతో దుబాయ్ వ్యాపారులు తక్కువ ధరకు బంగారాన్ని విక్రయిస్తున్నారు.
భారత్‌పై ప్రభావం ఎంత?
దుబాయ్ నుంచి వచ్చే సరఫరా ఆలస్యం కావడంతో భారత్‌కు తాత్కాలికంగా బంగారం దిగుమతులు తగ్గే అవకాశం ఉంది. అయితే జనవరిలోనే భారీగా బంగారం దిగుమతి కావడంతో దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: