ప్రపంచానికి డ్రగ్స్ (Drugs) మహమ్మారి ఓ పెద్ద సమస్యగా మారింది. చిన్న దేశమని లేదు పెద్ద దేశమని లేదు. అన్ని దేశాల్లో ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. మనదేశంలో ఈ సమస్య రానురాను అధికంగా పెరుగుతోంది. దీన్ని అదుపులోపెట్టేందుకు ప్రభుత్వాలు వీటిపై ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ సులభంగా ప్రజల చేతుల్లోకి చేరుతున్నది.
Donald Trump: కొనసాగుతున్న షట్ డౌన్.. నిధులను నిలిపేసిన ట్రంప్
వెనిజులా దేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) డ్రగ్స్ మాఫీయా యుద్ధాన్ని ప్రకటించిన విషయంతెలిసిందే. మాదక ద్రవ్యాలను తరలిస్తున్న బోటుపై అమెరికా మిలిటరీ తాజాగా జరిపిన దాడిలో నలుగురు మరణించారు.వెనిజులా తీరదేశానికి సమీపంలో శుక్రవారం ఈ దాడి జరిగిందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్ సెత్ (Minister Peter Hegg Seth) తాజాగా ఓప్రకటనలో తెలిపారు.
ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. ఇప్పటివరకు అమెరికా ఇలాంటి నాలుగుదాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కనీసం 21మంది మరణించి ఉంటారని అంచనా. తాజా దాడిలో నలుగురునిందితులు మరణించారు. భారీ స్థాయిలో వారు మాదకద్రవ్యాలను అమెరికాకు తరలిస్తున్నారు. అమెరికా ప్రజలను మాదకద్రవ్యాల (Narcotics) ముప్పు తొలగిపోయే వరకూ ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి’ అని హెగ్ నెత్ పేర్కొన్నారు.
చివరి వరకూ పోరాడుతాం
డ్రగ్ కార్టెల్స్ గా పిలిచే మాదరద్రవ్యాల ముఠాలపై పోరు చివరి వరకూ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్అక్కడి చట్టసభల సభ్యులకు తెలిపిన విషయం విధితమే. అయితే ఈ దాడులు చట్ట వ్యతిరేకమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఈ ముఠాలను అమెరికా ప్రభుత్వం విదేశీ సాయుధ దళాలుగా పేర్కొంది. వాటి చర్యలను అమెరికాపై దాడిగాఅభివర్ణించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: