Iran retaliation news : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఉన్న U.S. Embassy Riyadh పై డ్రోన్ దాడి జరిగినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనాస్థలంలో పొగలు ఎగిసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సౌదీ రక్షణ శాఖ ప్రకారం రెండు డ్రోన్లతో దాడి ప్రయత్నం జరిగినట్లు గుర్తించారు. భద్రతా వ్యవస్థలు వెంటనే స్పందించడంతో పెద్ద నష్టం తప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే కొంత మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
ఇటీవలి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei మరణించిన నేపథ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలు, ఎంబసీలపై దాడులు జరిగే అవకాశాలపై అప్రమత్తత పెంచారు.
Read also: Missile Attack on AliKhamenei: ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం

ఈ పరిణామాలపై రష్యా అధ్యక్షుడు Vladimir Putin ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలు మరింత విస్తరించకుండా దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఆయన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్, బహ్రెయిన్ నాయకులతో టెలిఫోన్లో మాట్లాడినట్లు సమాచారం.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు Donald Trump ఇరాన్‌పై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశాలను సూచించడంతో ప్రాంతీయ భద్రతపై అనిశ్చితి కొనసాగుతోంది.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: