ఈ ఏడాది అత్యధిక విరాళాలు అందించిన వారి జాబితాలో HCL టెక్నాలజీస్(HCL Technologies) వ్యవస్థాపకుడు శివ్ నాడార్(Shiv Nadar) కుటుంబం మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. వారు ₹2,708 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంథ్రఫీ లిస్ట్ 2025(Donations 2025) వెల్లడించింది. గత ఐదేళ్లలో నాలుగుసార్లు శివ్ నాడార్ ఈ జాబితాలో టాప్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాలో రెండో స్థానంలో ముకేశ్ అంబానీ కుటుంబం ₹626 కోట్లతో నిలిచింది. మూడో స్థానంలో బజాజ్ కుటుంబం ₹446 కోట్ల విరాళంతో ఉన్నారు. బిర్లా (₹440 కోట్లు), అదానీ (₹386 కోట్లు), నందన్ నీలేకణి (₹365 కోట్లు), హిందూజ గ్రూప్ (₹298 కోట్లు), రోహిణి నీలేకణి (₹204 కోట్లు) తదితరులు కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు.

Read Also: Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త .. 60 స్పెషల్ రైళ్లు
మొత్తం విరాళాల విలువ ₹10,380 కోట్లు
ఈ ఏడాది మొత్తం 191 మంది బిలియనీర్లు, ఇండస్ట్రియలిస్టులు,(Donations 2025) వ్యాపారవేత్తలు కలిపి ₹10,380 కోట్లు విరాళాలు ఇచ్చారు. ఇది గత సంవత్సరం కంటే గణనీయమైన పెరుగుదలగా హురున్ నివేదికలో పేర్కొంది. ఈ విరాళాలు ప్రధానంగా విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, సాంకేతిక విద్యా రంగాలకు మళ్లించబడ్డాయి. శివ్ నాడార్ ఫౌండేషన్ ఇప్పటికే పలు విద్యాసంస్థల స్థాపనలో కీలక పాత్ర పోషిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: