అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)నకు దీర్ఘకాల సిరల వ్యాధి (వీనస్ ఇన్‌సఫీషియెన్సీ) ఉన్నట్లు నిర్దరణ అయ్యినట్లు వైట్‌హౌస్(White House) ప్రకటించింది. అయితే ఇది సాధారణ రక్తప్రసరణ వ్యాధి అని పేర్కొంది. 70 ఏళ్లు దాటిన వారిలో సాధారణంగా ఇది కనిపిస్తుందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్(karoline leavitt) తెలిపారు. భయపడాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నట్లు మీడియాకు తెలిపారు.
గత కొద్ది రోజులుగా అధ్యక్షుడు ట్రంప్ కాళ్ల దిగువ భాగంలో, చీలమండ వద్ద తేలికపాటి వాపును గమనించారు. దీంతో వైద్యులు పరీక్షించగా, ఇది 70 ఏళ్ల పైబడిన వాళ్లలో వచ్చే సాధారణ సిరల లోపం అని వెల్లడించారు. భయపడాల్సినంత పరిస్థితి అయితే కాదని వైద్యులు తెలిపారు. డీప్ వీన్ థ్రోంబీసిస్ (రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టం) లేదా ఆర్టీరియల్ వ్యాధి (దమనులు మూసుకుపోవడం) వంటివి కాదు. ఇతర వైద్యపరీక్షల్లో గుండె, కిడ్నీ వైఫల్యం లాంటివి ఏం కాదు’ అని లీవిట్ తెలిపారు. గుండె, కిడ్నీ, లేదా ఇతర అవయవాల్లో అసాధారణతలు ఏవీ లేవని వైద్యులు స్పష్టీకరించారు.

ఫొటోల్లో కనిపించిన సమస్యలపై వివరణ
ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు లీవిట్ తెలిపారు. ట్రంప్ ఎలాంటి అసౌకర్యానికి గురవడం లేదని చెప్పారు. ఆయన ఆరోగ్యం పట్ల పారదర్శకత ఉండాలనే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్షుడి ఇటీవల ఫొటోల్లో ఆయన చేతి వెనక భాగంలో కనిపించిన ఫొటోలపై కూడా లీవిట్ స్పందించారు. అవి తరుచుగా కరచాలనం చేయడం, ఆస్పిరిన్ వాడకం వల్ల కలిగే సమస్యగా అని తెలిపారు. ప్రస్తుతానికి చికిత్స వివరాలను వెల్లడించలేదు. అయితే అధ్యక్షుడి వైద్య బృందం దీనిపై దృష్టి సారించింది.
ఏమిటీ సిరల వాపు సమస్య?
లోతైన సిరలు కాళ్ల భాగంలో ఉంటాయి. అయితే సిరలు సాధారణంగా శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండెకు పంపిస్తాయి. వీనస్ ఇన్సఫిషియెన్సీ(సిరల వాపు) అంటే కాళ్లలోని, ఇతర శరీర భాగాల్లోని సిరలు సరిగ్గా పనిచేయకపోవడం. దాని వల్ల రక్తప్రసరణలో సమస్యలు తలెత్తుతాయి. సిరల్లోని కావాటాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తం వెనక్కి ప్రవహిస్తుంది. దీంతో రక్తం కాళ్లలోని సిరల్లో పేరుకుపోతుంది. దీంతో దీర్ఘకాలంలో సమస్యలు వస్తాయి. ఎక్కువ సేపు నిలబడడం లేదా కూర్చోవడం, వయసు పెరగడం, అధిక బరువు లాంటి కారణాల వల్ల సిరల్లో సమస్యలు వస్తాయి. ఇది సాధారణమే కానీ, కొన్నిసార్లు సమస్య తీవ్రతరం అవుతుంది. వ్యాయామంతో ఈ సమస్యను అదుపులో చేయొచ్చు. కొన్నిసార్లు శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది .
ట్రంప్ వివరాలు
న్యూయార్క్ నగరంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన ట్రంప్ 1968లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు.
డోనాల్డ్ జాన్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, రాయకీయ నాయకుడు, వ్యాపారవేత్త, బుల్లితెర వ్యాఖ్యాత, రచయిత,2024, 2016 అమెరికా అధ్యక్ష్య ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ తరపున నవంబరు నెలలో జరిగిన ఎన్నికలలో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also : PM Kisan : ఖాతాల్లోకి రూ.2వేలు.. నేడు ప్రకటన!