అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అంతిఫాను ‘ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించారు. ఈ మేరకు తన ట్రూత్ సోసల్ ప్లాట్ఫామ్ ద్వారా ఆయన,ఈ విషయాన్ని తెలిపారు. అయితే దీన్ని ఎలా అమలు చేస్తారనేది స్పష్టంగా తెలియరాలేదు. అంతిఫాకు నిర్ధిష్టమైన నాయకత్వంగానీ, కేంద్ర వ్యవస్థగానీ లేదు. ఫలితంగా ట్రంప్ ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారన్న దానిపై సందిగ్ధత నెలకొంది.
అమెరికా దేశభక్తులకు శుభవార్త
“మన యూఎస్ దేశభక్తులకు ఒక శుభవార్త ‘అంతిఫా’ను, ఒక అనారోగ్యకరమైన, ప్రమాదకరమైన, తీవ్రవాద వామపక్ష విపత్తు’గా, ఒక పెద్ద ఉగ్రవాద సంస్థ (A terrorist organization) గా గుర్తిస్తున్నాను’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. దీనికి నిధులు సమాకూరుస్తున్నవారిపై అత్యున్నత చట్టపరమైనప్రమాణాలు, పద్ధతులకు గునుణంగా దర్యాప్తు చేయాలని సిఫార్సు చేస్తాను. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తాను.. అనిఆయన తన పోస్ట్లో రాశారు.

అంతిఫాకు ఛైర్మన్ వంటి నాయకత్వంగానీ, ప్రధాన కార్యాలయం అంటూ ఏదీ లేదు. అవసరం వచ్చినప్పుడుమాత్రం వేలసంఖ్యలో అంతిఫా కార్యకర్తలు (Antifa activists) గుమిగూడుతుంటారు. అజెండాకు తనుగుణంగా ఉద్యమిస్తుంటారు. అంతిఫాను భయంకర ఉగ్రవాద సంస్థగా, ఇటువంటి సామాజిక సమూహాలు ఇంకా చాలా ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: