हिन्दी | Epaper
ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

Donald Trump: చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి

Rajitha
Donald Trump: చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి

గత మూడురోజులుగా అమెరికా-వెనుజులా దేశాలమధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ప్రపంచదేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. కొత్త ఏడాది ఆరంభంలోనై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) తనదైన విధానంలో వెనెజులాపై విరుచుకుపడ్డారు. అమెరికా సైన్యం అకస్మాత్తుగా వెనుజులాపై సైనిక చర్య చేపట్టిన సంగతి విధితమే. అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను అరెస్టు చేసి దేశం వెలుపలికి తరలించింది. ఈ ఘటన ప్రపంచ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అమెరికా-వెనుజులా మధ్య ఉద్రిక్తతలు ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ ఈ స్థాయి దాడి ఎందుకు జరిగిందన్న ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు తెరలేచింది. మాదరద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యమని అధికారికంగా చెప్పినా..ఈ సైనిక చర్య వెనుక ఉన్న అసలు కారణం మరింత లోతైనదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read also: Trump threatens Colombia : కొలంబియాకు ట్రంప్ హెచ్చరిక, క్యూబా కూలిపోతోందన్న వ్యాఖ్యలు

The US attack on Venezuela is aimed at China

The US attack on Venezuela is aimed at China

అత్యధిక ముడిచమురులే కారణమా?

వెనుజులా ప్రపంచంలోనే అత్యధిక ముడిచమురు నిల్వలు కలిగిన దేశం కావడమే ఈ మొత్తం పరిణామానికి కేంద్ర బిందువుగా మారింది. ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థల గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వలు సుమారు 1.73 ట్రిలియన్ బ్యారెళ్లుగా అంచనా వేయబడుతున్నాయి. ఇందులో వెనెజులాకే దాదాపు 303 మిలియనన బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం, సౌదీ అరేబియాను కూడా వెనక్కి నెట్టి, వెనెజులా ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు నిల్వలు కలిగిన దేశంగా నిలుస్తోంది. 1970ల దాకా వెనెజులా చమురు ఉత్పత్తి, ఎగుమతుల్లో అగ్రగామిగా ఉండేది. అయితే, కమ్యూనిస్టు భావజాలం బలపడిన తర్వాత అక్కడి ప్రభుత్వం చమురురంగాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది. ప్రైవేట్ యాజమాన్యంలోని చమురు కంపెనీలను జాతీయీకరించడం వల్ల అమెరికా చమురు సంస్థలకు వెనెజులా వనరులపై ప్రవేశం పూర్తిగా మూసుకుపోయింది. ఈ పరిణామం అమెరికా వెనుజులా సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది.

వెనుజులాపై ట్రంప్ ఆంక్షలు

ఈనేపధ్యంలో అమెరికా వెనుజులాపై పలు ఆర్థిక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల కారణంగా వెనుజులా తన చమురు శుద్ధి వ్యవస్థలను ఆధునీకరించలేకపోయింది. ఫలితంగా అపారమైన చమురు నిల్వలు ఉన్నప్పటికీ.. వాటిని ఆదాయంగా మలచకోవడంలో దేశం తీవ్రంగా విఫలమైంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని చైనా ఎంట్రీ ఇచ్చింది. వెనుజులాకు భారీగా రుణాలు, ఆర్థిక సహాయం అందిస్తూ..బదులుగా ముడి చమురు సరఫరా ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం చైనాకు భారీగా అప్పులు ఉన్న దేశాల్లో వెనుజులా ఒకటిగా మారింది. ఈ పరిణామాలన్నీ అమెరికాకు వ్యూహాత్మకంగా పెద్ద సవాలుగా మారాయి. వెనుజులా చమురు వనరులు చైనా ప్రభావంలోకి వెళ్తే, ప్రపంచవ్యాప్తగా చైనా ఆర్థిక, భౌగోళిక శక్తి మరింత పెరుగుతుందన్న ఆందోళన వాషింగ్టన్ లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ప్రభుత్వం వేగంగా చర్యకు దిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మదురో ప్రభుత్వాన్ని తొలగించడం ద్వారా ఒకవైపు చైనా ప్రభావాన్ని తగ్గించడం, మరోవైపు వెనుజులా చమురు వనరులపై పట్టు సాధించడం అమెరికా లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870