అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)మరోసారి హమాస్ (Hamas)ఉగ్రవాద సంస్థపై తీవ్రమైన విమర్శలు చేశారు. కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతికి హమాస్ ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ మరింత దాడులు చేపట్టాలి అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక హమాస్ కథ ముగించాల్సిందేనని పేర్కొన్నారు. గాజాలో దాడులు తీవ్రతరం చేయాలంటూ ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు సూచించారు. స్కాట్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు ట్రంప్ (Donald Trump) మాట్లాడుతూ.. ‘హమాస్‌కు ఎటువంటి డీల్ చేసుకునేందుకు ఇష్టం లేదు. వాళ్లకు శాంతి నెలకొల్పడంపై ఆసక్తి లేదు. వాళ్లు చావాలని కోరుకుంటున్నట్టు ఉంది. ఇది చాలా దారుణం. ఇక దాని కథ ముగించాల్సిందే. గాజా లో మొదలు పెట్టిన పనిని పూర్తి చేయాలి. ప్రక్షాళన చేయండి. దాడులను ఉద్ధృతం చేయండి’ అంటూ ఇజ్రాయెల్ కు ట్రంప్ (Donald Trump) సూచించారు.

కాగా, మధ్యప్రాచ్యంలో శాంతి చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ హమాస్‌తో చర్చల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయంలో తమ వ్యూహాల్ని సమీక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. చర్చల్లో ప్రతిష్టంభనకు హమాస్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఇక హమాస్ చెరలో బందీలను విడిపించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ తెలిపారు.
డోనాల్డ్ ట్రంప్ పుట్టిన తేదీ?
డోనాల్డ్ జాన్ ట్రంప్ (జననం జూన్ 14, 1946) ఒక అమెరికన్ రాజకీయవేత్త, మీడియా ప్రముఖుడు మరియు వ్యాపారవేత్త, అతను యునైటెడ్ స్టేట్స్ యొక్క 47వ అధ్యక్షుడు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు, అతను 2017 నుండి 2021 వరకు 45వ అధ్యక్షుడిగా పనిచేశాడు. క్వీన్స్, న్యూయార్క్ నగరం, యు.ఎస్.
డోనాల్డ్ ట్రంప్ తల్లిదండ్రుల జాతీయత?
డొనాల్డ్ ట్రంప్ స్కాట్లాండ్‌తో ప్రత్యేకమైన బలమైన అనుబంధాన్ని కలిగి ఉన్న అమెరికా అధ్యక్షుడు. అతని తల్లి మేరీ అన్నే మాక్లియోడ్, హెబ్రిడియన్ ద్వీపం లూయిస్‌లో పుట్టి పెరిగింది, కానీ చాలా భిన్నమైన జీవితాన్ని గడపడానికి న్యూయార్క్‌కు వలస వెళ్ళింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Donald Trump: వలసలపై మరోసారి నోరుపారేసుకున్న ట్రంప్