భారత్-పాక్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి చాటింపు వేసుకున్నారు. ఉద్రిక్తతలను ఆపేందుకు రెండు దేశాలను సుంకాలతో బెదిరించినట్లు చెప్పారు. దీంతో ప్రధాని మోదీ తాము యుద్ధానికి వెళ్లబోమంటూ తనకు ఫోన్ చేసినట్లు ట్రంప్ (Donald Trump) తెలిపారు. ‘నేను యుద్ధాలు ఆపడంలో నిపుణుడిని. ఇప్పటికే అనేక దేశాల మధ్య ఉద్రిక్తతలను ఆపాను. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని కూడా నేనే ఆపాను. రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరగకుండా అడ్డుకున్నాను. 350 శాతం భారీ సుంకాలు విధిస్తానని బెదిరించడంతో ఇది సాధ్యమైంది. ఈ బెదిరింపులతో యుద్ధానికి వెళ్లడం లేదంటూ ప్రధాని మోదీ స్వయంగా నాకు ఫోన్ చేశారు’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
Read ALso: Russia: భారత్‌కు ఐదోతరం స్టెల్త్ ఫైటర్ జెట్ Su-57

కాగా, ఈ ఏడాది మే నుంచి ట్రంప్ 60 సార్లకుపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. పాక్-భారత్ మధ్య యుద్ధం తానే ఆపానంటూ ప్రపంచ వేదికగా చెప్పుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో భారత్ మాత్రం మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. స్వయంగా ప్రధానే ఈ విషయాన్ని చెప్పినప్పటికీ.. ట్రంప్ ప్రకటనలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒకచోట భారత్-పాక్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. రెండు దేశాల మధ్య యుద్ధం ఆపింది తానే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: