అమెరికాలో జరిగిన ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సదస్సులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో పెద్ద కంపెనీలు విదేశీ ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడటం సరికాదని, ముఖ్యంగా భారతీయ టెక్నాలజీ నిపుణులను నియమించడాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇండియా టెకీలను రిక్రూట్ చేసుకోవద్దు
గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి మేటి టెకీ కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) గట్టి వార్నింగ్ ఇచ్చారు. విదేశీ ఉద్యోగులను తీసుకోవడం ఆపేయాలన్నారు. ముఖ్యంగా ఇండియా లాంటి దేశం నుంచి టెకీలను రిక్రూట్ చేసుకోవద్దు అన్నారు. వాషింగ్టన్‌లో జరిగిన ఏఐ సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా కంపెనీలు స్వదేశంలో ఉద్యోగాలు క్రియేట్ చేయడంపై ఫోకస్ పెట్టాలన్నారు. చైనాలో ఫాక్టరీలు నిర్మించడం కానీ, భారతీయ టెకీ (Indian Techie)ఉద్యోగులను రిక్రూట్ చేయడం లాంటివి వద్దన్నారు. టెకీ కంపెనీలు ప్రదర్శిస్తున్న గ్లోబల్ మైండ్‌సెట్‌ను ఆయన విమర్శించారు. ఇలాంటి విధానం వల్ల అనేక మంది అమెరికన్లు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. అమెరికా స్వేచ్ఛను వాడుకుని కొన్ని టాప్ టెక్ కంపెనీలు అధిక లాభాలు గడించినట్లు తెలిపారు. ఆ కంపెనీలు విదేశాల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టాయన్నారు. ట్రంప్ (Donald Trump) అధ్యక్ష హయంలో ఇక రోజులు ఉండవని ఆయన అన్నారు.
డోనాల్డ్ ట్రంప్ పుట్టిన తేదీ
డోనాల్డ్ జాన్ ట్రంప్ (జననం జూన్ 14, 1946) ఒక అమెరికన్ రాజకీయవేత్త, మీడియా ప్రముఖుడు మరియు వ్యాపారవేత్త, అతను యునైటెడ్ స్టేట్స్ యొక్క 47వ అధ్యక్షుడు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు, అతను 2017 నుండి 2021 వరకు 45వ అధ్యక్షుడిగా పనిచేశాడు. క్వీన్స్, న్యూయార్క్ నగరం, యు.ఎస్.
ట్రంప్ రిపబ్లికనా లేక డెమొక్రాటా
ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థి అయినప్పటికీ, 2016 రిపబ్లికన్ జాతీయ సమావేశంలో ఆమోదించబడిన అధికారిక పార్టీ వేదిక తన సొంత అభిప్రాయాలకు భిన్నంగా ఉందని ఆయన సంకేతాలిచ్చారు. ది వాషింగ్టన్ పోస్ట్ లెక్క ప్రకారం, ట్రంప్ తన 2016 ప్రచార సమయంలో దాదాపు 282 ప్రచార వాగ్దానాలు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Plane Missing: రష్యా విమానం అదృశ్యం