Donald Trump: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియా రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ హతమైన రెండు రోజుల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఆసక్తికరమైన రహస్యాన్ని బయటపెట్టారు. ఖమేనీ తనను చంపడానికి రెండు సార్లు పకడ్బందీగా కుట్ర పన్నాడని, అయితే అతను తనను దెబ్బతీయకముందే తానే అతడిని హతమార్చానని ట్రంప్ వెల్లడించారు.ఏబీసీ న్యూస్ ప్రతినిధి జోనాథన్ కార్ల్‌తో ఆదివారం సాయంత్రం జరిపిన ఫోన్ సంభాషణలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. “అతను (ఖమేనీ) నన్ను చంపేలోపే నేను అతడిని పట్టుకున్నాను.
Read Also: US-Israel Iran War LIVE: ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో..
నిఘా వర్గాల అనుమానాలు నిజమేనా?
వారు రెండుసార్లు నాపై కుట్ర చేశారు.. కానీ నేను వారికంటే ముందే పని ముగించాను” అని ట్రంప్ గర్వంగా చెప్పుకొచ్చారు. 2024లో ట్రంప్‌పై జరిగిన రెండు హత్యాయత్నాల వెనుక ఇరాన్ హస్తం ఉందని నిఘా వర్గాల అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఈ అనుమానాలు నిజమే అని అర్థం అవుతోంది.

అసలీ రెండు హత్యాయత్నాలు ఏమిటి?
2024 జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్ చెవికి బుల్లెట్ తగిలిన ఘటన, ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఫ్లోరిడా గోల్ఫ్ కోర్సులో జరిగిన దాడి ప్రయత్నాల వెనుక ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) ప్రమేయం ఉన్నట్లు అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ గతంలోనే ఆరోపించింది. ఫర్హాద్ షాకేరి అనే వ్యక్తి ద్వారా ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్ ప్లాన్ చేసినట్లు ఆధారాలు లభించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: