Donald Trump news : అమెరికా అధ్యక్షుడు Donald Trump చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. కేబినెట్ నియామకాలపై మాట్లాడిన ట్రంప్, అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్ను ఎంపిక చేసిన కారణాన్ని వివరిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. బర్గమ్ భార్య కేథరిన్ చాలా అందంగా కనిపించిందని, ఆమెను చూసిన వెంటనే బర్గమ్‌కు పదవి ఇవ్వాలనిపించిందని బహిరంగంగా వ్యాఖ్యానించారు.
మాదకద్రవ్యాల నియంత్రణపై జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల ప్రచార (Donald Trump news) సమయంలో బర్గమ్ దంపతులు గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను చూశానని, అందులో కేథరిన్ ఆకర్షణీయంగా కనిపించిందని తెలిపారు. ఆ వీడియో చూసిన తర్వాత ఆమె ఎవరో తెలుసుకున్నానని, అప్పుడే బర్గమ్‌ను తన టీమ్‌లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు బర్గమ్, ఆయన భార్య సమక్షంలోనే చేయడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
Read Also: Australia: ఆసీస్ కెప్టెన్‌గా సోఫీ మోలినెక్స్ నియామకం
అయితే, డగ్ బర్గమ్ ఒక సాధారణ నేత కాదని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. ఆయన నార్త్ డకోటా రాష్ట్రానికి రెండుసార్లు గవర్నర్‌గా పనిచేసిన అనుభవం కలిగిన నేత. అలాంటి వ్యక్తి సామర్థ్యాన్ని పక్కన పెట్టి, కేవలం ఆయన భార్య అందాన్ని కారణంగా చూపడం సరికాదని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. మహిళలను రూపంతో కొలవడం, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: