భారత్-పాకిస్థాన్ల మధ్య యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి గొప్పలు చాటుకున్నారు. దీనిపై ఇప్పటికే భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Narendra Modi), విదేశీవ్యవహారాల మంత్రి జైశంకర్ వివరణ ఇచ్చారు. యుద్ధాన్ని ఆపిన విషయంలో ట్రంప్ ఘనత ఏమీ లేదని స్పష్టం చేశారు. అయినా కూడా ట్రంప్ పదేపదే తన గొప్పలు గురించి మీడియా సమావేశంలో చెప్పడం గర్హనీయం. అంతేకాదు ట్రంప్ (Donald Trump) మరింత ముందుకు వెళ్తూ, ‘మేం చాలా యుద్ధాలను ఆపాం, ఆ యుద్ధాలు చిన్నవేమీ కావు, ఇండియా, పాకిస్థాన్ల మధ్య కొనసాగుతున్న విభేదాలు తీవ్రమైనవి, ఆ సమయంలో విమానాలను కూల్చివేశారు, ఐదు జెట్లు కూలిపోయాయని నేను అనుకుంటున్నా’ అని అన్నారు. అంతేకాదు ఇవి అణ్వాయుధ సామర్థ్యం గల దేశాలు. ఒకదానిపై ఒకటి దాడులు చేస్తున్నాయి, ఇవి కొత్తరకతం యుద్ధాలు’ అని పేర్కొన్నారు.

మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించదు
ఇటీవల భారత్-అమెరికాలమధ్య వాణిజ్య ఒప్పందాలలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ (India-Pakistan) విషయానికొస్తే మరోవారం ఆలస్యం అయితే అణ్వాయుధ యుద్ధం జరిగేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. అలా జరగకుండా ట్రేడీల్ చేశామన్నారు. రెండుదేశాల మధ్య యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ ఈనెల 14న అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మే10న ఇరుదేశాలు కాల్పుల వవిరమణకు అంగీకరించాయి. ట్రంప్ వాదనను భారత్ మొదటి నుంచి ఖండిస్తూనే వస్తున్నది. రెండుదేశాల సైనిక కార్యకలాపాల అధికారుల మధ్య జరిగిన చర్చల ద్వారానే ఈ విరమణ ఒప్పందం జరిగినట్లు భారత్ స్పష్టం చేస్తోంది. భారతదేశానికి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని ఖరాఖండిగా చెప్పింది .
Read hindi news: hindi.vaartha.com
Read also: Indian Students : అమెరికాలో భారీగా తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య!