అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఇటీవల రిపబ్లికన్ నేతలతో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ,”ఇండియా–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో 5 యుద్ధ విమానాలు కూలినట్లు(planes crashing) నేను అనుకుంటున్నాను” అంటూ తెలిపారు. కానీ ట్రంప్ స్పష్టంగా ఈ విమానాలు ఏ దేశానికి చెందినవో చెప్పలేదు. అంటే ఇవి భారత దేశం దేనా, లేక పాకిస్తాన్‌దేనా అన్నది తెలియని విధంగా వ్యాఖ్యానించారు.

పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అయిదు యుద్ధ విమానాలు కూలినట్లు ట్రంప్ (Donald Trump)వెల్లడించారు. రిపబ్లికన్ ప్రతినిధులతో జరిగిన డిన్నర్ భేటీలో ట్రంప్ (Donald Trump)ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఏ దేశ యుద్ధ విమానాలు కూలిపోయానన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ఇది నమ్మలేరు, గాలిలోనే విమానాలను పేల్చేశారు. అయిదో నాలుగో.. నాకు తెలిసి అయిదు యుద్ధ విమానాలను కూల్చేశారని ట్రంప్ ఆ మీటింగ్‌లో అన్నారు.
డోనాల్డ్ ట్రంప్ వయస్సు ఎంత?
79 సంవత్సరాల, 1 నెల మరియు 4 రోజుల వయసులో, అమెరికాకు 47వ మరియు గతంలో 45వ అధ్యక్షుడిగా పనిచేసిన డొనాల్డ్ ట్రంప్, అమెరికా చరిత్రలో రెండవసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అతి పెద్ద వ్యక్తి. ఆయన గతంలో తన 78వ పుట్టినరోజు తర్వాత ఐదు వారాల తర్వాత జూలై 2024లో ప్రధాన పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అత్యంత పెద్ద వయస్కుడయ్యాడు.
ఇవాంకా ట్రంప్ ఎవరు?
ఇవానా మేరీ “ఇవాంకా” ట్రంప్ జూనియర్ అక్టోబర్ 30, 1981 న న్యూయార్క్ సిటీలో జన్మించారు. … ఆమె అమెరికన్ మహిళా వ్యాపారవేత్త, 2017 నుండి అధ్యక్షుడు సీనియర్ సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు, ఆమె తండ్రి డోనాల్డ్ ట్రంప్.
Read hindi news: hindi.vaartha.com