
అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆరోగ్యం గురించి మళ్ళీ వార్తల్లో నిలిచారు. నిన్న(Donald Trump) వైట్‌హౌస్‌లో జరిగిన సుదీర్ఘ క్యాబినెట్ సమావేశంలో ఆయన నిద్రమత్తులో ఉన్నట్లు చూపించారు. మీడియా ముందు “25 ఏళ్ల క్రితం కంటే నేను చాలా చురుగ్గా ఉన్నానని” ప్రకటించిన కొద్ది సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
సుమారు రెండు గంటల పాటు కొనసాగిన సమావేశంలో ట్రంప్ ప్రారంభంలో ఆరోగ్యంపై వార్తలను ఖండించారు. అయితే, సమావేశం మొదలైన 15 నిమిషాల లోపలే ఆయన పలుమార్లు కంట్లు మూసుకొని కునుకుతూ వీడియోల్లో రికార్డయ్యారు. పలువురు మంత్రులు తమ శాఖల పనితీరును వివరించగా, ట్రంప్ కొద్ది సెకన్ల పాటు కళ్లు మూసుకుని ఉన్నారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో పక్కన ఉన్నప్పుడు కూడా ట్రంప్ శ్రద్ధతో, కానీ కునుకుతూ ఉన్నట్టు కనిపించారు.
Read also: 10 వ తరగతి విద్యార్థుల మార్కుల ఆధారంగా టీచర్లకు గ్రేడ్లు

ఆరోపణలను నిరాకరించిన వైట్‌హౌస్
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఈ ఆరోపణలను నిరాకరించారు. అధ్యక్షుడు(Donald Trump) సమావేశాన్ని పూర్తిగా నడిపించినట్లు, అన్ని అంశాలను గమనించి తీసుకున్న నిర్ణయాలు శ్రద్ధగా విన్నారంటూ వివరించారు. సమావేశం ముగిసిన తర్వాత విలేకరుల ప్రశ్నలకు ఆయన స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. ఇటీవలి కాలంలో 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యం గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. వైట్‌హౌస్ గతంలో ఆయనకు ‘క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ’ (CVI) రక్తనాళాల సమస్య ఉందని వెల్లడించింది. అయితే, అక్టోబర్‌లో వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు ధృవీకరించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: