हिन्दी | Epaper

Dinesh Kumar: సరిహద్దులో కొనసాగుతున్న కాల్పులు ..ఒక జవాను మృతి

Sharanya
Dinesh Kumar: సరిహద్దులో కొనసాగుతున్న కాల్పులు ..ఒక జవాను మృతి

పహల్గామ్ ఉగ్రదాడి భారతదేశాన్ని తీవ్రంగా ఉలిక్కిపడేసింది. ఈ దాడికి బదులుగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో కీలక ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్రతీకార దాడితో రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. భారత సైన్యం శక్తివంతంగా ఎదురుదాడికి దిగింది. ఇందులో పలువురు ఉగ్రవాదులు మరణించినట్లు నివేదికలు వెల్లడించాయి.

పౌరుల ప్రాణాలు ముప్పులో

కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ బలగాలు మోర్టార్ షెల్లింగ్, ఫైరింగ్‌కు పాల్పడుతున్నాయి. ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతుండటంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పాక్ దాడులు అధికంగా రెసిడెన్షియల్ ఏరియాలపైనే జరుపుతుండటం వల్ల సరిహద్దు ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

భారత సైనికుడు వీరమరణం

బుధవారం అర్ధరాత్రి పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాను వీరమరణం పొందినట్లు తెలిసింది. పాక్ షెల్లింగ్‌లో గాయపడిన 5వ ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ అమరుడైనట్లు వైట్ నైట్ కోర్ ధ్రువీకరించింది. గత 14 రోజులుగా పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు 12 మంది భారత పౌరులు మృతి చెందగా, 57 మంది గాయపడినట్లు సైన్యం వెల్లడించింది. 

Read also: Rakshana Mantri Rajnath : ఆపరేషన్ సిందూర్‌కు హనుమంతుడే స్ఫూర్తి: రక్షణ మంత్రి రాజ్నాథ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్: పశ్చిమాసియాలో భీకర యుద్ధం

ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్: పశ్చిమాసియాలో భీకర యుద్ధం

100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్!.. రష్యా ఆయిల్‌పై అమెరికా కీలక నిర్ణయం!

100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్!.. రష్యా ఆయిల్‌పై అమెరికా కీలక నిర్ణయం!

మోజ్తాబా ఖమేనీకి జీవిత బీమా లేదు: నెతన్యాహు

మోజ్తాబా ఖమేనీకి జీవిత బీమా లేదు: నెతన్యాహు

ఇరాన్ యుద్ధంతో పనామా కాలువకు పెరిగిన ట్రాఫిక్‌

ఇరాన్ యుద్ధంతో పనామా కాలువకు పెరిగిన ట్రాఫిక్‌

అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ ఎందుకని తప్పుకున్నారు?

అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ ఎందుకని తప్పుకున్నారు?

రూ.320 దాటిన పెట్రోల్.. ఆర్థిక సంక్షోభం తీవ్రం!

రూ.320 దాటిన పెట్రోల్.. ఆర్థిక సంక్షోభం తీవ్రం!

పెరిగిన వంట నూనె ధరలు

పెరిగిన వంట నూనె ధరలు

యుద్ధం విరమించాలంటూ ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్

యుద్ధం విరమించాలంటూ ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్

గల్ఫ్ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

గల్ఫ్ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

📢 For Advertisement Booking: 98481 12870