DGCA notice : భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై డీజీసీఏ తీవ్రంగా స్పందించింది. భద్రతా లోపాలు ఉన్నప్పటికీ విమానాలను నడిపినందుకు ఎయిర్ ఇండియా కాక్‌పిట్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై రెండు వారాల్లోగా స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
డీజీసీఏ పరిశీలనలో, ఢిల్లీ–టోక్యో మధ్య ప్రయాణించిన AI-357 విమానం, అలాగే తిరుగు ప్రయాణంలో టోక్యో నుంచి ఢిల్లీకి వచ్చిన AI-358 విమానాల నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తేలింది. ఈ విమానాలు ‘మినిమమ్ ఎక్విప్‌మెంట్ లిస్ట్ (MEL)’ నిబంధనలకు అనుగుణంగా లేవని డీజీసీఏ పేర్కొంది.
ఇది ఒక్కసారిగా జరిగిన పొరపాటు కాదని, గతంలోనూ ఇతర (DGCA notice) సెక్టార్లలో ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యాయని డీజీసీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం బాధ్యులైన పైలట్లపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ప్రశ్నించింది.
Read also: Cigarette price hike : సిగరెట్ ధరలు భారీగా పెంపు సెంట్రల్ ఎక్సైజ్ బిల్లు 2025కి ఆమోదం
ఇదిలా ఉండగా, గత నెలలో ఢిల్లీ–ముంబై (AIC 887) విమానం ఇంజిన్ సమస్యతో వెనక్కి రావడంపై కూడా డీజీసీఏ విచారణ జరుపుతోంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రెండో ఇంజిన్‌లో ఆయిల్ ప్రెజర్ జీరోకి పడిపోవడంతో పైలట్లు ఇంజిన్‌ను షట్‌డౌన్ చేసి విమానాన్ని సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ చేశారు.
బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు వెలుగుచూస్తుండటంతో భద్రతపై డీజీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అన్ని ఘటనలపై డైరెక్టర్ ఎయిర్ సేఫ్టీ ఆధ్వర్యంలో లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: