దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనను పాకిస్తాన్(Pakistan) మీడియా ప్రముఖంగా(Delhi blast) ప్రచురించింది. డాన్, జియో న్యూస్, ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్, ది న్యూస్ ఇంటర్నేషనల్, పాకిస్తాన్ టుడే వంటి ప్రముఖ సంస్థలు ఈ వార్తను తమ ఫ్రంట్ పేజీలలో ప్రచురించాయి. ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద దర్యాప్తు జరుగుతోందని ఆయా పత్రికలు పేర్కొన్నాయి. ఈ మేరకు, ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఈ పేలుడుపై దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ పోలీసులు వెల్లడించినట్లు డాన్ పత్రిక తన కథనంలో తెలిపింది. ఢిల్లీలో ఎక్రోట వద్ద పేలుడు: 8మంది మృతి అనే శీర్షికతో ఆ పత్రిక వార్తను ప్రచురించింది. ప్రధానమంత్రి మోదీ ఈ ఘటనపై సమీక్ష జరిపారని కూడా పేర్కొంది. పాకిస్తాన్ టుడే పత్రిక కూడా ఇదే తరహా శీర్షికను పెట్టింది.
Read also: పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు దుర్మరణం

మిగతా పత్రికలు ఇలా ప్రచురించాయి
జియో న్యూస్, ది న్యూస్ ఇంటర్నేషనల్ పత్రికలు ఢిల్లీ పేలుడు ఘటనపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద దర్యాప్తు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి. ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక ‘ఎర్రకోట వద్ద అనుమానాస్పద కారులో ‘పేలుడు’ అనే శీర్షికతో వార్తను ప్రచురించింది. ఈ పేలుడు అనంతరం భారతదేశంలోని పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: