సమాజంలో వారు వైద్యులు.(Doctors) అందరి దృష్టిలో డాక్టర్లు, రోగులకు సేవలు చేసేవారుగా గుర్తింపు. అంతేకాదు రోగుల పాలిట వారు దేవుళ్లు. ఇదంతా నాణానికి వైపుమాత్రమే. రెండోవైపు కుట్రలు, హత్యలు, భారీ నష్టాలను కలిగించే ఉగ్రవాద క్రియలు. తమ కెరీర్ ను, జీవితాలను పణ్ణంగా పెట్టి, ఉగ్రవాదులుగా (Terrorists) మారుతున్నారు. ఇవే ఢిల్లీ పేలుడుకు కారణమైన వైట్ కాలర్ కుట్రలు. ఢిల్లీ పేలుడు కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
Read also : Keir Starmer: వలస విధానంలో బ్రిటన్ మార్పులు లక్షలాది మందిపై ప్రభావం

పేలుడు కేసులో (Delhi Blast) కీలక నిందితుడు, ఆ సమయంలో కారు నడిపిన డాక్టర్ ఉమర్ నబీకి బాంబుల తయారీలో శిక్షణ ఇవ్వడానికి ఉగ్రసంస్థలు పాకిస్తాన్ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. హంజుల్లా అనే జైషే మహమ్మద్ హ్యాండ్లర్ ఈ వీడియోలను అతడికి పంపినట్లు తెలుస్తోంది. మొత్తం 42 వీడియోలు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఉగ్ర కుట్రల గురించి నిందితులు టెలిగ్రామ్ యాప్ లో చర్చించుకునేవారని..ఇతరులకు అనుమానం రాకుండా ఆయుధాలు, బాంబుల గురించి వంటకాల పేర్లను సీక్రెట్ కోడ్ లుగా వాడేవారని అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలకు బిర్యానీ అని, ఉగ్ర ఘటనలు అమలు చేయడానికి దావత్ అని కోడ్ నేమ్ లను ఉపయోగించినట్లు గుర్తించారు.
జమ్మూకశ్మీర్ లోని నౌగామ్ లో జైషే మహ్మద్ పోస్టర్లు కలకలం
అక్టోబర్ లో జమ్మూకశ్మీర్ లోని (Jammu and Kashmir) నౌగామ్ లో జైషే మహ్మద్ పోస్టర్లు కలకలం సృష్టించడంతో ఈ ఉగ్రకుట్రలపై దర్యాప్తు మొదలైన విషయం తెలిసిందే. అంతేకాక ఢిల్లీలో ఉగ్రదాడులు చేయడానికి వీరు కొన్నేళ్లుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. 2022లో ముగ్గురు ఉగ్ర డాక్టర్లు తుర్కియేలో పర్యటించిన సమయంలో పాక్ హ్యాండ్లర్ అక్కడ వారు సిరియాకు చెందిన ఆపరేటివ్ తో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. అందులో వారు బాంబుల తయారీ, ఉగ్రదాడుల ప్రణాళికలపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఢిల్లీ, గురుగ్రామ్,
ఫరీదాబాద్ లోని పై ప్రొఫైల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ వైట్ కాలర్ టెర్రర్ బృందం 200 శక్తివంతమైన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ పోజివ్ డివైజ్ (ఐఇడి) అను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :