ఢిల్లీ ఎర్రకోట ఆత్మాహుతి దాడి ఘటనపై నిందితుడు ఉమర్ నబీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఆత్మాహుతి బాంబు(Delhi Blast)దాడిని “బలిదాన చర్య”గా అతడు పేర్కొన్న వీడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలను AIMIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు.
సోషల్ మీడియా వేదిక X లో స్పందించిన ఒవైసీ, ఇస్లాం మతంలో ఆత్మహత్యా చర్యలూ, అమాయకుల ప్రాణాలను హరించడం కూడా తీవ్ర పాపమని స్పష్టం చేశారు. ఉమర్ వ్యాఖ్యలను పూర్తిగా తిరస్కరించిన ఆయన, ఇటువంటి చర్యలు మతపరంగానూ, చట్టపరంగానూ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబడవని అన్నారు. “ఇలాంటి దాడులు స్పష్టమైన ఉగ్రవాద కార్యకలాపాలే” అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Road accident : సౌదీలో చిదిమేసిన రోడ్డు ప్రమాదం!
ఆత్మాహుతి దాడిని సమర్థిస్తున్న ఉమర్ నబీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమయంలో ఒవైసీ చేసిన ఈ స్పందన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు, ఢిల్లీ పేలుడు కేసుకు సంబంధించి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసిన ఘటనపై కేంద్రాన్ని కూడా ఒవైసీ నిలదీశారు.
“గత ఆరు నెలల్లో కశ్మీరీ యువకులు ఎవ్వరూ ఉగ్రవాద(terrorism) సంస్థల్లో చేరలేదని హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో వెల్లడించారు. అయితే ఇప్పుడు బయటపడుతున్న ఈ ఉగ్ర మాడ్యూల్ ఎక్కడి నుంచి వచ్చింది?” అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఒవైసీ చేసిన ఈ ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: