పహల్గామ్‌లో ఉగ్రవాదుల ఘాతుకం తరువాత పాకిస్తాన్ మరింత రెచ్చిపోతోంది. భారత్‌పై బురదజల్లే ప్రయత్నాలకు తెర తీసింది. ఎదురుదాడికి దిగుతోంది. అంతర్జాతీయ వేదికలపైనా భారత్‌ను బద్నాం చేయడానికి శతవిధాలా శ్రమిస్తోంది గానీ అవేవీ ఫలించట్లేదు. దీనితో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరింత బరితెగించారు. తన కడుపుమంటను బయటపెట్టుకున్నారు. భారతే స్వయంగా ఉగ్రవాదాన్ని పోషిస్తోందంటూ బట్ట కాల్చి ముఖం వేశారు. ఒకదశలో చొరబాట్లనూ సమర్థించుకున్నారాయన. సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

భారత్ ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదు
తమ బలగాలను బలోపేతం చేశామని, కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోదలచుకున్నామని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. తమపై భారత్ దాడికి పాల్పడే అవకాశం ఉన్నందున ఆ దేశాన్ని అన్ని రకాలుగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చొరబాటు ఆసన్నమైందని తాను ఎందుకు భావిస్తున్నానో మరిన్ని వివరాలలోకి వెళ్లలేదని ఆయన అన్నారు. పహల్గామ్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తాన్‌కు చెందినవారని భారత్ చెప్పడాన్ని ఖవాజా తప్పు పట్టారు ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్ ఇలాంటి ప్రకటనలను చేయడం సరికాదని అన్నారు. దీన్ని తమ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారని, తటస్థ దర్యాప్తుకు పిలుపునిచ్చిన విషయాన్ని ఆసిఫ్ గుర్తు చేశారు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నాయకుడు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో కూడా ఇదేరకంగా మాట్లాడారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు కూడా.
Read Also : Himanshi Narwal: ముస్లింలపై పహల్గామ్ దాడిలో మరణించిన నేవీ ఆఫీసర్ భార్య కీలక సూచనలు