అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదవీ స్వీకారం చేసిన రోజున నుంచి విదేశీయులకు చుక్కలు చూపిస్తున్నారు. అధిక సుంకాలను విధిస్తూ, ప్రపంచ దేశాల మధ్య చిచ్చురేపుతున్నారు. ఇక వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. కఠిన వీసా నిబంధనలతో భారతీయుల రాకను అడ్డుకుంటున్నారు. దీంతో భారత్-అమెరికా ప్రజల మధ్య విద్వేషాలను ట్రంప్ రేకెత్తిస్తున్నారు. నిన్న ట్రంప్ అత్యంత సన్నిహితుడు చార్లీ కిర్ను (Charlie Kirk) దుండగులు తుపాకితో దారుణంగా,హతమార్చారు. ఈయన వారం రోజుల ముందు భారతీయుల రాకను అడ్డుకోవాలని, అందుకు వారికి వీసాలు ఇవ్వరాదని నినాదాలతో హోరెత్తించారు.
అమెరికాలో,భారతీయుల వల్లే ఉద్యోగాలు రావడం లేదని వాపోయారు. దీంతో భారతీయులపై అమెరికా పౌరులు ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తిని అతని సహోద్యోగి కత్తితో తల నరికేయడం కలకలం రేపింది. భారత సంతతి కి చెందిన వ్యక్తులు అకాల మరణాలకు గురికావడం తీవ్ర వేదనను మిగుల్చుతున్నది. డాలస్ నగరం (City of Dallas) లో ఓ మోటల్లో మేనేజర్ గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్య(50) అతని సహోద్యోగే కత్తితో తల నరికేయడం కలకలం రేపింది.
స్వల్ప వివాదం హత్యకు దారితీసిన వైనం
బుధవారం నాగమల్లయ్య, మార్టినేజ్ మధ్య ఓ విషయంపై వివాదం చెలరేగింది. మార్టినెజ్ మోటల్ లో గదిని శుభ్రం చేస్తున్నాడు. విరిగిపోయిన వాషింగ్ మెషీన్ (Washing machine) ను వాడొద్దని నాగమల్లయ్య చెప్పాడు. ఈ విషయాన్ని అతడు నేరుగా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగితో చెప్పించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన మల్లయ్యతో వాగ్వాదానికి దిగాడు.

అంతటితో ఆగకుండా ఆవేశంతో ఊగిపోతూ మార్టినెజ్ మల్లయ్య (Mallaiah) ను కత్తితో పలుమార్లు పొడిచాడు. మలయ్య పారిపోయేందుకు ప్రయత్నించినా కూడా వెంటాడు మరి అతడి తల నరికేశాడు. ఆ తర్వాత తలను చెత్తకుప్పలో పడేశాడు. మల్లయ్య కుటుంబికులు మార్టినెజ్ను ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
స్పందించిన భారత కాన్సులేట్
ఈ ఘటనపై భారత కాన్సులేట్ (Indian Consulate) ఎక్స్ లో స్పందించింది. మల్లయ్య హత్య దిగ్భ్రాంతికి గురిచేసిందని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపింది.అంతేకాక బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి అన్నివిధాలా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఈ సంఘటనతోఅమెరికాలో భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. నడిరోడ్డుపై తలను నరకడమే కాక, ఆ తలను తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేయడం అత్యంత భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన అని స్థానికులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రజలకు ప్రభుత్వాన్ని
కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: