
కొత్త ఏడాది ప్రపంచదేశాలన్ని ఆనందంతో స్వాగతం పలికాయి. ప్రజలు కూడా తమ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ‘హ్యాపీ న్యూఇయర్’ అంటూ శుభాకాంక్షలు చెబుతుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. కానీ స్విట్జర్లాండ్ లో(Switzerland) మాత్రం ప్రమాదం వల్ల అక్కడి ప్రజల ఆనందం ఆవిరైపోయింది. (Crime) కొత్త ఏడాది వేళ స్విట్జర్లాండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లగ్గరీ ఆల్పైన్ స్కీ రిసార్ట్ పట్టణం క్రాన్స్ మోంటానాలోని ఒక బార్ లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పలువురు మరణించినట్లు పోలీసులు చెప్పినట్లుగా స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో అనేకమంది గాయపడినట్లు పేర్కొంది.
Read also: America: వలసదారుల్లో ప్రయాణ భయం… ట్రిప్పులు రద్దు చేస్తున్న ఇమిగ్రెంట్స్

మరణించిన వారిపై లేని స్పష్టత
లే కాన్స్టె లేషన్ అనే బార్ లో గురువారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో పేలుడు సంభవించింది. (Crime) ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com