డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి పదవి పొందిన అనంతరం ఇష్టానుసారంగా ఆర్డర్లపై సంతకాలు చేస్తున్నారు. వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపడమే కాక వారి రాకను అడ్డుకుంటున్నారు. అంతేకాక పలు కంపెనీలలో భారతీయులను తొలగించాలని ఆదేశిస్తున్నారు. ఎక్కడికక్కడ నిధులను సమకూర్చుకోవడంతో ట్రంప్ ప్రభుత్వం విఫలం కావడంతో దేశంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి.
Layoff:భారతీయ ఐటీ ఉద్యోగుల తొలగింపు: అమెరికన్ కంపెనీ షాక్ నిర్ణయం
దీంతో అమెరికా (America) సెనేట్ లో ప్రభుత్వం రన్ చేయడానికి కావాల్సిన నిధులు ఆగిపోయాయి. దీని కారణంగా అక్కడి ప్రభుత్వం మూతబడింది. చాలా ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.చాలా ప్రభుత్వ సేవలకు నిధులు ఆగిపోయాయి.
సెనేట్ లో డొమోక్రాట్లకు, రిపబ్లికన్లు ఒక అంగీకారానికి రాకపోవడం వల్లనే ఇదంతా జరిగింది.ముఖ్యంగా డెమోక్రాట్లు ఆరోగ్యానికి సంబంధించి బిల్లును పాస్ చేయాలని పట్టుబట్టారు. కానీ ఆ బిల్ల ఆమోదం పొందితే అక్రమ వలసదారులకు హెల్ప్ చేసినట్లు అవుతుందని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది.

రిపబ్లికన్లు ఒప్పుకోకపోవడంతో
తాము ప్రతిపాదించిన బిల్లును రిపబ్లికన్లు (Republicans) ఒప్పుకోకపోవడంతో వారు ప్రతిపాదించిన బిల్లులను కూడా డెమోక్రాట్లు అంగీకరించలేదు. దీని కారణంగానే అమెరికా ప్రభుత్వం స్తంభించిపోయింది.ప్రతీకార చర్యలకు పూనుకుంటున్న ట్రంప్ డెమోక్రాట్లపై తన ప్రతీకారాన్ని తీర్చుకోవాలని చూస్తున్నారు. షికాగోకు దాదాపు 2.1 మిలియన్ల నిధుల బిల్లులను ఆపేశారు.
తమ ప్రభుత్వం షట్ డౌన్ లో పడేందుకు డెమోక్రాట్లేనని.. అందుకే వారు పాలిస్తున్న ఇతర రాష్ట్రాల నిధులు కూడా ఆపేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతోపాటు షట్ డౌన్ కారణంగా యూఎస్ ఆర్మీ, నేవీ. ఎయిర్ఫోర్స్, మెరైన్ కార్డ్స్, కోస్ట్ గార్డ్, స్పేస్ ఎయిర్ ఫోర్స్ లోని 1.3 మిలియన్ల మంది ఉద్యోగులకు జీతంఅందడం లేదని వైట్ హౌస్ కార్యదర్శి కరోనా లీవిట్ (Corona Leavitt) పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ షట్ డౌన్ మిలియన్ మంది అమెరికన్లపై తీవ్రమైన ప్రభావంచూపిస్తుందని చెప్పారు.
నాసాలోనూ ఆగిపోయిన కార్యకలాపాలు
అమెరికా స్పేస్ ఏజెన్సీ అయిన నాసా (NASA) లో కూడా కార్యకలాపాలు ఆగిపోయినట్లు తెలుస్తోంది. దాని అధికారిక వెబ్సైట్ లో ఫెడరల్ ప్రభుత్వం నిధులకొరత కారణంగా నాసా వెబ్సైట్ ను అప్డేట్ చేయడం లేదంటూ’ చూపిస్తోంది. అమెరికా ప్రభుత్వ నిధుల బిల్లులకు కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో ఇటీవల షట్ డౌన్ మొదలైన సంగతి తెలిసిందే. షట్ డౌన్ ప్రభావం వల్ల అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు నిలిచిపోయాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: