हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Cool: ప్రపంచంలోనే అతి చల్లని నగరం గురించి తెలుసా?

Vanipushpa
Cool: ప్రపంచంలోనే అతి చల్లని నగరం గురించి తెలుసా?

మన దేశంలో కాశ్మీర్ అంటేనే మంచు కురిసే నగరం. అక్కడ ఒక్కోసారి ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు చేరుతూ ఉంటాయి. అప్పటికే అక్కడ అన్ని వస్తువులు గడ్డకడుతూ ఉంటాయి. ఆ స్వల్ప ఉష్ణోగ్రతలకు అక్కడి ప్రజలు వణికిపోతూ ఉంటారు. ఇక బయటి ప్రాంతాల నుంచి వెళ్లిన వారు అక్కడికి వెళ్తే తీవ్ర ఇబ్బందులు పడుతారు. అయితే రష్యాలోని యాకుటియా నగరం మాత్రం ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే నగరంగా నిలిచింది. యాకుటియా(Yakutia) సిటీలో మైనస్ 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉష్ణోగ్రత దారుణంగా పడిపోవడంతో అక్కడ జనజీవనం స్తంభించిపోయింది. కనురెప్పలు గడ్డకట్టేంత చలిలోనూ అక్కడి ప్రజలు ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు.. మల్టీ లేయర్ దుస్తులు, వినూత్న నిర్మాణ శైలితో జీవనం సాగిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శీతల నగరంగా పేరుగాంచిన రష్యాలోని యాకుటియా ప్రస్తుతం గడ్డకట్టే చలితో విలవిలలాడుతోంది. సైబీరియా రీజియన్‌లో ఉన్న ఈ నగరంలో ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మైనస్ 60 డిగ్రీల సెల్సియస్‌కు కూడా చేరుకోవచ్చని వాతావరణ నిపుణులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.

Read Also: IndianPolice Jobs:SSC కానిస్టేబుల్- 2025 ఫలితాలు విడుదల

Cool: ప్రపంచంలోనే అతి చల్లని నగరం గురించి తెలుసా?
Cool: ప్రపంచంలోనే అతి చల్లని నగరం గురించి తెలుసా?

కనురెప్పలపై కూడా మంచు గడ్డకడుతుంది

యాకుటియా నగరంలో చలి ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. గాలిలోని తేమ వెంటనే గడ్డకట్టి మంచు పొగలా మారుతుంది. దీనివల్ల కనుచూపు మేర ఏమీ కనిపించదు. బయటకు వస్తే కేవలం నిమిషాల వ్యవధిలోనే కనురెప్పలపై కూడా మంచు గడ్డకడుతుంది. ఇటీవల ఒక మహిళ తన కనురెప్పలపై మంచు పేరుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. వేడి వేడి నీటిని కూడా గాలిలోకి చల్లితే.. ఆ నీరు కింద పడకముందే మంచు స్పటికాలుగా మారిపోతుంది. ఇంతటి విపరీతమైన వాతావరణంలో జీవించడం అక్కడి ప్రజలకు నిత్యం ఒక సవాలుగా మారుతోంది. అక్కడ బతకడానికి స్థానికులు కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటిస్తారు. యాకుటియా నగరంలో నివసించే ప్రజలు కనీసం 3 నుంచి 5 పొరల ఉన్ని దుస్తులను ధరిస్తారు. మొహం మొత్తం కప్పేసి కేవలం కళ్లు మాత్రమే బయటికి కనిపించేలా జాగ్రత్త పడతారు. మరోవైపు.. యాకుటియా నగరంలో కార్లలో ఉండే ఇంజిన్ ఆయిల్ గడ్డకట్టకుండా ఉండటానికి వాటిని ఆఫ్ చేయకుండా 24 గంటల పాటు స్టార్ట్ చేసే ఉంచుతారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870