ఇటీవల వెనిజులాపై అమెరికా సైన్యం మోహరించి, ఆదేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. అంతేకాక వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను అమెరికా తమ నిర్భందంలో ఉంచుకుంది. దీంతో ప్రపంచ రాజకీయాల ఒక సారిగా వేడెక్కాయి. మూడో ప్రపంచయుద్ధానికి దారితీస్తుందా అనే టెన్షన్ తో పలు దేశాలున్నాయి. వెనిజులాలో అధికారాన్ని చేజిక్కించుకుని, ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకోవడంపై చైనా స్పందించింది. (China) దీనిపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (Xi Jinping) ‘ఇతర దేశాల అభివృద్ధి మార్గాన్ని గౌరవించడంలో ప్రధాన శక్తులు ముందుండాలని పిలుపునిచ్చిన ఆయన, పరోక్షంగా అమెరికాపై విమర్శలు చేశారు. చాలాకాలం నుంచి చైనా, వెనిజులా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. అంతేకాదు, వెనిజులాకు చైనా అతిపెద్ద చమురు కొనుగోలుదారు. ‘ఈ శతాబ్దంలో ఎన్నడూ చూడని మార్పులు, అల్లకల్లోలాలకు ప్రపంచం లోనవుతోంది. ఏకపక్ష, బెదిరింపు చర్యలు అంతర్జాతీయ క్రమాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి’ అని చైనా అధినేత షీ జిన్ పింగ్ విమర్శించారు. వెనిజులాపై వాషింగ్టన్ దాడిని ఇంతకు ముందే చైనా తీవ్రంగా విమర్శించగా తాజాగా ఆ దేశ అధ్యక్షుడు దీనిపై స్పందించారు.
Read Also: America: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం.. గాయపడ్డ ఇద్దరు పిల్లలు

ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు పాటించాలి: చైనా
ఇతర దేశాల ప్రజలు స్వతంత్రంగా ఎంచుకునే అభివృద్ధి మార్గాలను అన్ని దేశాలూ తప్పనిసరిగా గౌరవంచాలి. (China) అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు, సూత్రాలను పాటించాలి. ముఖ్యంగా అగ్రరాజ్యాలు ఈ విషయంలో ముందుండి నడవాలి’ అని ఐర్లాండ్ ప్రధాన మంత్రి మైఖేల్ మార్టీన్ తో సమావేశం సందర్భంగా జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, విదేశీ శక్తుల ఒత్తిడి లేకుండా ఇతర దేశాలతో ఆర్థిక సంబంధాలను కొనసాగించే హక్కు వెనిజులాకు ఉందని చైనా ఇంతకు ముందే ఉద్ఘాటించింది. మదురో, ఆయన భార్యను అమెరికా తక్షణమే విడుదల చేయాలని కోరింది. ఓ సార్వభౌమ ప్రభుత్వంపై అమెరికా బలవంతపు చర్యలు దిగ్భ్రాంతికి గురిచేశాయని, వీటిని తినరవంగా ఖండిస్తున్నామని పేర్కొంది. మెక్సికో, కొలంబియా లాంటి లాటిన్ దేశాలు కూడా తమ మాట వినకుంటే మదురో పరిస్థితి వస్తుందని ట్రంప్ చేసిన బెదిరింపులు తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: