బ్రిక్స్ (Brics)కూటమిలోని దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(donald Trump) గట్టి హెచ్చరిక జారీ చేశారు. అమెరికా(America) వ్యతిరేక విధానాలను అనుసరించే ఏ దేశంపైనైనా సరే 10 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తామని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం బ్రెజిల్‌లో బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సదస్సులో భారత ప్రధానమంత్రితో పాటు ఇతర సభ్య దేశాల నేతలు అమెరికా సుంకాల విధానాన్ని పరోక్షంగా ప్రస్తావించిన నేపథ్యంలో ట్రంప్ స్పందన వచ్చింది.
ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలపై చైనా స్పందించింది. సుంకాల యుద్ధంలో ఎవరూ విజేతలుగా నిలవరని, తాము ఘర్షణను కోరుకోవడం లేదని పునరుద్ఘాటించింది. రక్షణాత్మక వాణిజ్య వైఖరి సరైంది కాదని చైనా పేర్కొంది. గతంలో అమెరికా-చైనాల మధ్య తీవ్రమైన వాణిజ్య యుద్ధం నడిచినప్పటికీ, ఆ తర్వాత కుదిరిన ఒప్పందంతో అది తాత్కాలికంగా సద్దుమణిగింది.

కాగా, బ్రిక్స్ కూటమిపై ట్రంప్ ఇటీవల కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ దేశాలు డాలర్‌తో ఆడుకోవాలని చూస్తే, వాణిజ్యపరంగా వారిని దెబ్బతీస్తానని బెదిరించారు. “నా హెచ్చరికలతోనే బ్రిక్స్ ప్రతిపాదన బలహీనపడింది. ఒకవేళ వారు మాకు వ్యతిరేకంగా ముందుకెళితే 100 శాతం సుంకాలు వేస్తాను. అప్పుడు నా దగ్గరకే వచ్చి వేడుకుంటారు” అని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో ప్రారంభమైన బ్రిక్స్ కూటమిలో ఇటీవల ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలు కూడా సభ్య దేశాలుగా చేరాయి.
చైనా స్పష్టీకరణ – బ్రిక్స్ ఘర్షణకు వేదిక కాదు
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందిస్తూ:
“వాణిజ్య యుద్ధాల్లో ఎవరూ గెలవరు, రక్షణవాదం సమర్థవంతమైన మార్గం కాదు.”
బ్రిక్స్ అనేది:
“అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు మరియు దేశాల మధ్య సహకారానికి ముఖ్య వేదిక” అని అభివర్ణించారు. ఇది “బహిరంగత, కలుపుగోలుతనం, గెలుపు-గెలుపు సహకారాన్ని” ప్రోత్సహిస్తుంది.
ఏ దేశాన్ని లక్ష్యంగా చేయదు, శిబిర ఘర్షణల్లో పాల్గొనదు అని స్పష్టం చేశారు.
బ్రిక్స్ దేశాలు ప్రత్యామ్నాయ కరెన్సీని ఎందుకు కోరుకుంటున్నాయి?
బ్రిక్స్ – అసలు ఐదుగురు సభ్యుల (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా) పేరు మీద పెట్టబడింది – అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ప్రయోజనాలను పెంపొందించడానికి మరియు ప్రపంచ వాణిజ్యంలో ఇప్పటివరకు ఎక్కువగా ఉపయోగించే కరెన్సీ అయిన US డాలర్‌పై వారు తక్కువ ఆధారపడేలా చేయడానికి 2009లో ఏర్పడింది .
Read hindi news: hindi.vaartha.com
Read Also: Prashant Kishor : విజయ్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ తాత్కాలిక బ్రేక్..