ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా.. 2025లో అమెరికాతో జరిగిన తీవ్ర వాణిజ్య యుద్ధాన్ని విజయవంతంగా ఎదుర్కొని చరిత్రాత్మక రికార్డును సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత చైనాపై భారీ స్థాయిలో సుంకాలు విధించినప్పటికీ, చైనా తన ఎగుమతి వ్యూహాలను మార్చుకుని వాణిజ్యరంగంలో అపూర్వ విజయాన్ని సాధించింది. చైనా కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2025లో చైనా మొత్తం వాణిజ్య మిగులు 1.189 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది 2024తో పోలిస్తే దాదాపు 20 శాతం అధికం. ముఖ్యంగా నవంబర్ నెలలో తొలిసారిగా చైనా వాణిజ్య మిగులు 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటడం ప్రపంచ ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
read Also: UIDAI: మీ ఆధార్ కార్డు సేఫ్‌గా ఉందో లేదో ఇలా తెలుసుకొండి

చైనా సవాల్‌గా కాకుండా అవకాశంగా మలుచుకుంది
అమెరికా విధించిన కఠినమైన సుంకాల ప్రభావంతో 2025లో అమెరికాకు China ఎగుమతులు సుమారు 20 శాతం తగ్గాయి. అయితే, దీనిని చైనా సవాల్‌గా కాకుండా అవకాశంగా మలుచుకుంది. అమెరికా మార్కెట్‌పై ఆధారపడకుండా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, యూరోపియన్ యూనియన్ వంటి కొత్త మార్కెట్ల వైపు చైనా తన ఎగుమతులను మళ్లించింది. గణాంకాల ప్రకారం.. 2025లో ఆఫ్రికాకు చైనా ఎగుమతులు 25.8 శాతం పెరిగాయి. ఆసియాన్ దేశాలకు 13.4 శాతం, యూరోపియన్ యూనియన్‌కు 8.4 శాతం వృద్ధి నమోదైంది. అమెరికాకు వెళ్లాల్సిన ఉత్పత్తులను ఇతర దేశాలకు మళ్లించడం ద్వారా చైనా వాణిజ్య సమతుల్యతను నిలబెట్టుకుంది. ఇదే విధానాన్ని ఇటీవల భారతదేశం కూడా అనుసరిస్తుండటం గమనార్హం.
చైనా ముందున్న సవాళ్లు
యువాన్ విలువ తక్కువగా ఉండటం వల్ల చైనా ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత పోటీ ధరలకు లభించాయి. అంతేకాదు, అనేక దేశాలు యువాన్ కరెన్సీలోనే వ్యాపారం చేయడం చైనాకు మరింత బలాన్ని ఇచ్చింది. 2025లో దాదాపు ఏడాది లోపు ఏడు నెలలు చైనా వాణిజ్య మిగులు 100 బిలియన్ డాలర్లను దాటడం మరో కీలక అంశం. 2024లో ఇది ఒక్కసారి మాత్రమే జరిగింది. విశేషమేమిటంటే, ట్రంప్ సుంకాల అమలు తర్వాతే చైనా వాణిజ్యం మరింత బలపడింది. అయితే 2026లోకి ఎంటర్ అయిన వేళ చైనా ముందున్న సవాళ్లు కూడా తక్కువేమీ కావు. అధిక ఉత్పత్తి సామర్థ్యం, కీలక రంగాల్లో చైనాపై ప్రపంచ దేశాల అధిక ఆధారపడటం, రియల్ ఎస్టేట్ రంగం పతనం, దేశీయ డిమాండ్ బలహీనత వంటి సమస్యలు చైనా ముందున్న ప్రధాన పరీక్షలు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: