ఈ ఏడాది తొలి టైటిల్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) కు మరోసారి నిరాశ ఎదురైంది. బలమైన ఆటతీరుతో క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చిన ఈ తెలుగు తేజం అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో (In the women’s singles quarterfinals), వరల్డ్ నెంబర్ వన్ అయిన దక్షిణ కొరియా స్టార్ అన్ సే యంగ్ చేతిలో సింధు, ఓటమిపాలైంది.
ఈ పోరులో సింధు 14-21, 13-21 తేడాతో ఓడిపోవడం ఆమె అభిమానులను నిరాశకు గురిచేసింది. మ్యాచ్ మొత్తం 38 నిమిషాల్లోనే ముగిసింది. ప్రారంభం నుంచే అన్ సే యంగ్ (An Se Young) ఆధిపత్యం కనబరచగా, సింధు తన ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆటలో ఏ దశలోనూ సింధు బలమైన పోటీ ఇవ్వలేకపోయింది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన అన్ సే యంగ్
యంగ్ చేతిలో సింధుకు ఇది వరుసగా 8వ ఓటమి. ఇప్పటి వరకు ఈ సౌత్ కొరియా ప్లేయర్‌పై సింధు ఒక్క సింగిల్స్ మ్యాచ్ గెలవలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన అన్ సే యంగ్.. సెమీఫైనల్లో అకనే యమగూచి (Akane Yamaguchi) తో తలపడుతోంది.గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో సింధు 21-15, 21-15తో ఆరో సీడ్ పోర్న్‌పవీ చోచువాంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది.
14వ ర్యాంకర్ అయిన సింధు ఆరో ర్యాంకర్‌ను ఓడించడంతో ఫామ్‌లోకి వచ్చిందని అంతా అనుకున్నారు. కానీ సౌత్ కొరియా ప్లేయర్ ను సింధు ఓడించలేక ఇంటి దారి పట్టింది.భారత డబుల్స్ ఏస్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టిలు కూడా ఈ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. డబుల్స్‌లో 8వ సీడ్ సాత్విక్ ద్వయం 21-13, 21-12తో తైపీ జంట సియాంగ్ చీ చియు-వాంగ్ చి లిన్‌ను ఓడించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: